OTT : Oscar 2024 ఓప్పెన్ హైమర్‌తో సహా ఈ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా నిర్వహించారు. అయితే ఈసారి మన దేశానికి ఆస్కార్ రాలేదు. గత ఏడాది నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి అన్ని అవార్డులు హాలీవుడ్ సినిమాలే సొంతం చేసుకున్నాయి. వేరే భాషల చిత్రాల ఈ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయాయి. అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' హాలీవుడ్ చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు లభించాయి. ఓపెన్ హైమర్ తో పాటు.. పలు హిట్ చిత్రాలని కూడా ఈ అవార్డులు లభించాయి. మరి ఈ సినిమాలు ఓటీటీలో ఎక్కడ చూడాలి.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఈ స్టోరీలో చూసేద్దాం.

ఆస్కార్ అవార్డులు 2024 వేడుక అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకల్లో హాలీవుడ్ చిత్రాలు సత్తా చాటాయి. ఇక ఓప్పెన్ హైమర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు లభించాయి. ఓపెన్ హైమర్ తో పాటు పలు చిత్రాలు కూడా అవార్డులు దక్కించుకున్నాయి. ఇక చాలా మంది ప్రేక్షకులు, సినీ ప్రియులు ఆ సినిమాలు ఏ ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఆరా తీస్తున్నారు.

Oscar 2024 Winning Movies OTT Streaming Details Here Oppenheimer poor things barbie Etc

సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమాలంటే సినీ ప్రియులకు ఆసక్తి ఎక్కువే. మరీ ముఖ్యంగా ఆస్కార్ వచ్చిందంటే ఆ మూవీకి ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఈసారి 'ఓప్పెన్ హైమర్', 'బార్బీ', 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' తదితర చిత్రాలు ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు 'అమెరికన్ ఫిక్షన్', 'ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ది హోల్డోవర్స్' లాంటి మనకు పెద్దగా తెలియని సినిమాలకు కూడా అవార్డులు దక్కాయి.

ఆస్కార్ విన్నింగ్ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో కింద వివరాలు ఉన్నాయి. 7 అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. వాటితో పాటు పలు చిత్రాలు పలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీరు వాటిపై ఓ లుక్కేసి.. ఇంట్రెస్ట్ ఉన్న చిత్రాలను చూసి ఎంజాయ్ చేయండి.

Oscar 2024 Winning Movies OTT Streaming Details Here Oppenheimer poor things barbie Etc

1. ఓప్పెన్ హైమర్ - జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ (తెలుగు-మార్చి 21)
2. ఓప్పెన్ హైమర్ - అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ (ఇంగ్లీషులో- రెంట్)
3. పూర్ థింగ్స్ - హాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ (ఇంగ్లీష్)
4. ది హోల్డోవర్స్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్
5. బార్బీ - జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
6. అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్
7. గాడ్జిల్లా మైనస్ వన్ - ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో లేదు
8. అమెరికన్ ఫిక్షన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్
9. ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్
10. 20 డేస్ ఇన్ మరియూపోల్ - అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X