OTTలోకి కంటతడి పెట్టించే రియల్ స్టోరీ.. ఈ ఆస్కార్ నామినీ డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఓటీటీలోకి వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో వస్తూ అందరినీ అలరిస్తుండగా.. మరో అద్భుతమైన ఆస్కార్ నామినీ డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా ఆస్కార్ అవార్డులు ప్రకటించకడానికి ఒకరోజు ముందే ఓటీటీలోకి.. సడెన్ గా రావడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆ డాక్యుమెంటరీ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం
ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా నామినేట్ అయిన "టు కిల్ ఎ టైగర్" డాక్యుమెంటరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సెన్సేషనల్ డాక్యుమెంటరీని నిషా పహుజా డైరెక్ట్ చేశారు. నిషా పహుజాతో పాటు డేవిడ్ ఓపెన్ హిమ్, కార్నిలియా ప్రిన్సిప్ లు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. నిజ జీవిత ఘటనల అధారంగా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మహాద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలింటే ఈ స్టోరీని ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాలి.

ముఖ్యంగా జార్ఖండ్‌లోని రాంచీలో ఒక కుటుంబం ఉంటుంది. వారికి 13 ఏళ్ల కూతురు ఉండగా.. పల్లెటూరిలో వీరు జీవనం సాగిస్తారు. ఆటలు, చదువు తప్ప మరో ధ్యాస లేని ఈ చిన్నారి ఒకరోజు క్రూరమైన అత్యాచారానికి గురవుతుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాప కోసం న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆ మానవ మృగాలకు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని చాలా కష్ట పడ్డారు. అయితే దీని ఆధారంగానే ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది.
అయితే ఈ చిత్రాన్ని 2022 సెప్టెంబర్ 10వ తేదీన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అలాగే 2023 జూన్ లో లైట్‌హౌస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అమెరికన్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ప్రస్తుతం 96వ అకాడమీ అవార్డులలో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డుకు ఈ డాక్యుమెంటరినీ నామినేట్ చేశారు. అయితే తాజాగా ఈ డాక్యుమెంటరీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేధికగా.. టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతీ ఒక్కరి హృదయాన్ని మెలిపెట్టేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూసేయండి. అద్భుతమైన అనుభూతిని పొంది.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో కామెంట్ల రూపంలో వెల్లడించండి.


Click it and Unblock the Notifications











