సైలెంటుగా OTTలోకి వచ్చేసిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీని ఎలా చూడాలంటే?
వీకెండ్ వచ్చిందంటే చాలు అనేక కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ముందస్తు సమాచారం ఇచ్చి ఓటీటీలో అడుగు పెడుతుండగా.. మరికొన్ని మాత్రం ఎలాంటి ముచ్చటా చెప్పకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తూ.. అందరినీ థ్రిల్ చేస్తున్నాయి. ఇలా ఇప్పటికే వీకెండ్ లో భాగంగా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రాగా.. తాజాగా మరో క్రేజీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆస్కార్ విన్నింగ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి సినీ ప్రియులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది నవంబర్ లో వచ్చిన క్రేజీ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీయే గాడ్జిల్లా మైనస్ వన్. ఈ సినిమాను తకాషి యమజాకి రచించి, దర్శకత్వం వహించారు. తోహో స్టూడియోస్ మరియు రోబోట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే గాడ్జిల్లా ఫ్రాంచైజీలో ఇది 37వ చిత్రం. అలాగే తోహో 33వ గాడ్జిల్లా మూవీ. ఈ క్రేజీ మూవో ర్యునోసుకే కమికి, మినామి హమాబే, యుకీ యమడ, మునెతక అయోకి, హిడెటకా యోషియోకా, సకురా ఆండో మరియు కురనోసుకే ససాకిలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

అయితే ఈ సినిమాను 2019లో ప్రారంభించారు. కానీ కరోనా కారమంగా ఈ సినిమా వాయిదా పడింది. అలా అన్ని సవాళ్లను ఎదుర్కుని మూడేళ్లకు సినిమాను పూర్తి చేశారు. అంటే 2023లో ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. అలాగే తొలిసారి జపాన్ లో ఈ సనిమాను 2023 నవంబర్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ రిలీజ్ చేసాడు. ఇలా విడుదల అయిన ప్రతీ చోట సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ.. ఇండియాలో మాత్రం విడుదల కాలేకపోయింది.

అయితే బెస్ట్ విజ్యువల్ ఎఫెక్స్ట్ విభాగంలో ఈ సినిమాకు 2023లోనే ఆస్కార్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇలా ఆస్కార్ అవార్డు పొందిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా భారతీయులు అంతా ఈ సినిమా చూసే వెసులు బాటు కల్పించింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను చాలా మంది చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్రేజీ మూవీపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











