Oscars 2023 Movies OTT: ఆస్కార్ కొల్లగొట్టిన చిత్రాలు.. ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయండి!

ఆస్కార్.. సగటు సినీ నటుడు కలలు కనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రపంచ వేదికపై అతిరథ సినీ దిగ్గజాల ముందు ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే ఈ అవార్డులను గెలడవం అంత మాములు విషయం కాదు. కనీంస నామినేషన్స్ స్థాయికి వెళ్లిన చాలు అది కూడా గొప్పగానే భావిస్తారు. ఒక సినిమాకు ఆస్కార్ వచ్చిందంటే చాలు చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఆ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ ప్రేమికులు పోటీ పడతారు. అయితే ఆ సినిమాలను సీడీలు కొనుగోలు చేసి లేదా టీవీల్లో టెలీక్యాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతున్నందున అవి వీక్షించడం చాలా సులభం అయింది. 95వ ఆస్కార్ అందుకున్న కొన్ని సినిమాలను ఏ ఓటీటీల్లో చూడొచ్చో తెలుసుకుందామా!

RRR (రౌద్రం రణం రుధిరం)

RRR (రౌద్రం రణం రుధిరం)

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ 2023 (95th Academy Awards) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటిగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇతర భాషలు జీ5లో (Zee5) ప్రసారం అవుతున్నాయి.

ది ఎలిఫెంట్ విస్పర్స్

ది ఎలిఫెంట్ విస్పర్స్


ఆస్కార్ 2023 వేడుకల్లో RRR కాకుండా అవార్డు అందుకున్న మరో భారతీయ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పర్స్' (The Elephant Whisperers). 95వ అకాడమీ అవార్డులో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ మూవీ విజేతగా నిలిచింది. కార్తీక్ గోన్ స్లేవ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురునీత్ మోంగ నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఏకంగా 7 అవార్డ్స్..

ఏకంగా 7 అవార్డ్స్..

95వ అకాడమీ అవార్డ్స్ లో (Oscars 2023) అత్యధిక బహుమతులు గెలుచుకున్న మూవీ 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' (Everything Everywhere All at Once). మొత్తం 7 విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు వరించాయి. అంతేకాకుండా ఆస్కార్ చరిత్రలో ఉత్తమ నటిగా అవార్డు పొందిన తొలి ఆసియా మహిళగా మిచెల్ యెహ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంకా ఉత్తమ సహాయ నటుడిగా కె.హుయ్ క్వాన్, ఉత్తమ చిత్రం కేటగిరీలో నిర్మాత జోనాథన్ వాంగ్, ఉత్తమ నటి, బెస్ట్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ ఇలా పలు విభాగాల్లో ఈ చిత్రానికి బహుమతులు సొంతం అయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది.

నాలుగు పురస్కారాలతో..

నాలుగు పురస్కారాలతో..

ఆస్కార్ 2023లో సత్తా చాటిన మరొక చిత్రం 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' (All Quiet on the Western Front). ఈ మూవీ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కింద క్రిస్ట్రియన్ ఎం గోల్డ్ బెక్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో మొత్తంగా నాలుగు అవార్డులు దక్కాయి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

బ్లాక్ ఫాంథర్ 2

బ్లాక్ ఫాంథర్ 2

2022 సంవత్సరంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి హిట్ కొట్టిన చిత్రం 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' (Black Panther: Wakanda Forever) (Black Panther 2). ఈ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో ఆస్కార్ పురస్కారం సాధించింది. మార్వెల్ మూవీస్ నుంచి గతేడాది అనేక చిత్రాలు రాగా బ్లాక్ ఫాంథర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా అలరించింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో (Disney Plus Hotstar) ప్రసారం అవుతోంది.

రెండు ఓటీటీల్లో అవతార్ 2

రెండు ఓటీటీల్లో అవతార్ 2

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన సినిమా 'అవతార్ 2' (Avatar: The Way Of Water) (Avatar 2). దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డుతో సరిపెట్టుకుంది. అయితే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మార్చి 28న విడుదల చేస్తున్నారు. యాపిల్ టీవీ, వుడ్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

 టాప్ గన్: మావెరిక్ అండ్ పినోచియో

టాప్ గన్: మావెరిక్ అండ్ పినోచియో

ఇక హాలీవుడ్ యాక్షన్ హీరోల్లో పెట్టింది పేరు టామ్ క్రూజ్. ఆయన ఇటీవల నటించిన చిత్రం 'టాప్ గన్: మావెరిక్' (Top Gun: Maverick). గతేడాది థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాకు బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ సొంతం చేసుకున్న 'పినోచియో' (Pinocchio) నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. అయితే ఆస్కార్ గెలిచిన మరికొన్ని చిత్రాలు 'ఉమెన్ టాకింగ్', 'ది వేల్', 'నవానీ' సినిమాలు మన ఓటీటీల్లో అందుబాటులో లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X