అల్లు అర్జున్ అండర్‌లోకి నెట్‌ఫ్లిక్స్ .. అఫీషియల్‌గా తేల్చేసిన ఓటీటీ దిగ్గజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబో అంటేనే ఇండస్ట్రీలో భారీ అంచనాలుంటాయి. ఆర్యతో మొదలైన వీరి జర్నీ .. పుష్ప సిరీస్‌తో టాప్‌కి చేరింది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలే తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేవని ఇప్పటి అనుకున్న వారికి షాకిచ్చింది పుష్ప సిరీస్. రాజమౌళి హీరోలను మించి పాన్ ఇండియా మార్కెట్‌లో క్రేజ్, కలెక్షన్స్‌తో హల్ చల్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
బన్నీ- సుక్కూల కాంబోలో వచ్చిన పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండా నార్త్‌లో దిగిన ఈ సినిమా దుమ్మురేపింది. మాటలు, పాటలు, డైలాగ్స్‌తో దేశాన్ని ఒక ఊపు ఊపింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూశారు. దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2ని నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. ఎప్పుడో రావాల్సిన పుష్ప 2 ది రూల్ .. అనివార్య కారణాలతో నాలుగు నెలలు ఆలస్యంగా గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11 వేల థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజైన పుష్ప 2 ఇప్పటి వరకు రూ.1850 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.250 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూశారు. పుష్ప2 డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. జనవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ థియేటర్‌లో మంచి ఆక్యూపెన్సీ, కలెక్షన్స్ కూడా బాగుండటంతో .. కొన్ని కారణాల వల్ల పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది.

ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. జనవరి 30 నుంచి 20 నిమిషాల ఎక్స్‌టెండెడ్ వర్షన్‌తో కలిపి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. కేవలం 24 గంటల వ్యవధిలోనే పుష్ప 2 ది రూల్.. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. టాప్ 10 సినిమాలలో ప్రజెంట్ నెంబర్ వన్‌గా నిలిచింది. పుష్పగాడి దెబ్బకి నెట్‌ఫ్లిక్స్ దాసోహం అయ్యింది. అది ఎంతలా అంటే ఏకంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాల బయోలలో దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకొచ్చింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు వాటి స్క్రీన్ షాట్‌లను వైరల్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పుష్ప 2 ఓటీటీ వెర్షన్‌లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











