Disney Hotstar: హాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు.. మీరు వాటిని చూశారా?
వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి టాప్ మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఒకటని తెలిసిందే. కాగా ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల తర్వాత వీరికే అత్యధిక సబ్ స్క్రైబర్ లు సొంతం. అయితే ఇండియాలో కూడా దీని యూజర్లు చాలా ఎక్కువే కాగా కొన్నాళ్ల కితం వరకు హాట్ స్టార్ గా ఉండేదాన్ని ప్రపంచ ప్రఖ్యాత సంస్థ డిస్నీ వారు సొంతం చేసుకోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గా మారింది. కాగా ఈ ఓటిటిలో ప్రస్తుతం ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతున్న కంటెంట్ ఏంటి సిరీస్ లు సినిమాలు ఏమేం ఉన్నాయి మన తెలుగు నుంచి హిందీ నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఏం వీక్షిస్తున్నారో చూద్దాం.
ఇక ఎప్పటిలానే రివర్స్ ఆర్డర్ లో టాప్ 10 నుంచి చూసినట్టు అయితే.. టాప్ 10వ స్థానంలో మన తెలుగు సిరీస్ "సేవ్ ది టైగర్స్ సీజన్ 2" ట్రెండ్ అవుతుంది. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ లు నటించగా తేజ కుకుమను, అరుణ్ లు దర్శకత్వం వహించారు. ఇక టాప్ 9 లో నితిన్, శ్రీ లీల లు నటించిన రీసెంట్ ప్లాప్ చిత్రం "ఎక్స్ట్రార్డినరీ మ్యాన్" ట్రెండింగ్ లో ఉంది, దీనిని వక్కంతం వంశి దర్శకత్వం వహించారు.

ఇక టాప్ 8 లో చూసుకున్నట్టు అయితే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సి లు నటించిన హారర్, కామెడీ సినిమా "అనబెల్ సేతుపతి" ట్రెండింగ్ లో ఉంది. ఇక టాప్ 7 లో అయితే రీసెంట్ గా మలయాళ సినిమా దగ్గర భారీ వసూళ్లతో దుమ్ము లేపిన చిత్రం "మంజుమ్మల్ బాయ్స్" ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించగా ఈ తెలుగు వెర్షన్ ఇప్పుడు టాప్ 10 కి గాను 7లో ట్రెండ్ అవుతుంది.
ఇక టాప్ 6 లో ఇంట్రెస్టింగ్ గా మన వాళ్ళు పిల్లల కార్టూన్ షో "షిన్ చాన్" ని నిలిపారు. ఇక టాప్ 5 లో ఇండియన్ ప్రముఖ యానిమేటెడ్ సిరీస్ "లెజెండ్ ఆఫ్ హనుమాన్ లేటెస్ట్ సీజన్ 4" ట్రెండ్ అవుతుంది. దీనికి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. కాగా ఇక టాప్ 4 లో మరో కార్టూన్ షో "డోరేమాన్" ట్రెండ్ అవుతుండగా టాప్ 3 కి వచ్చేసరికి బాలీవుడ్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు గుల్షన్ దేవయా, అనురాగ్ కశ్యప్ తదితరులు నటించిన బ్యాడ్ కాప్ సిరీస్ కేవలం నాలుగు రోజులు కితమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సిరీస్ ని ఆదిత్య దత్ దర్శకత్వం వహించగా హిందీ సహా తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది.
ఇక టాప్ 2లోకి వచ్చినట్టు అయితే మన తెలుగు నుంచి ఇటీవల వచ్చిన ఇంట్రెస్టింగ్ సోషియో ఫాంటసీ సిరీస్ ద్రాక్షకుడి తేజ మార్ని తెరకెక్కించినది "యక్షిణి" నిలిచింది. ఈ సిరీస్ లో గ్లామరస్ నటి వేదిక ప్రధాన పాత్రలో నటించగా బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ వారు నిర్మాణం వహించారు. వీరి నుంచి వచ్చిన ఈ పాన్ ఇండియా థ్రిల్లర్ సిరీస్ టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతుంది.
కాగా ఇక ఫైనల్ గా టాప్ లో చూస్తే కోలీవుడ్ రీసెంట్ హిట్ సినిమా "బాక్" ట్రెండ్ అవుతుంది. ఇద్దరు బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా కలయికలో దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన ఈ హారర్, కామెడీ డ్రామా కొన్ని రోజులు కితమే ట్రెండింగ్ లోకి వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమా నెంబర్ 1 ప్లేస్ లో తెలుగులో ట్రెండ్ అవుతూ నిలిచింది. ఇది కూడా మల్టీ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











