హరిహర వీరమల్లు ఓటీటీ కష్టాలు.. పవన్ కల్యాణ్ మూవీకి రిలీజ్‌కు అలాంటి కండిషన్?
ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిలు ఏ రీతిలో ఆడియెన్స్ లోకి అలాగే సినిమా మార్కెట్ లోకి చొచ్చుకెళ్లిపోయాయో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇపుడు ఓటిటిల ప్రభావం ఏ రేంజ్ కి వెళ్లిందంటే పలు సినిమాల భవిష్యత్తుని కూడా ఇవే డిసైడ్ చేసే రేంజ్ లోకి వెళ్లాయి.
అక్కడ హీరో ఎవరు? దర్శకుడు ఎవరు అనే లాంటివి పట్టింపులు లేకుండా ఓటిటి సంస్థలు ఖాతరు చేయడం లేదు. తమతో డీల్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ సినిమా ఆన్ టైం వచ్చి తీరాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇలా ఓటిటిలు నిర్మాతలకి షాకిస్తున్నాయి. కాగా మన సౌత్ లో ఇటీవల ఇండియన్ 2 సినిమాకి నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ తో పడ్డ ఇక్కట్లు కోసం అందరికీ తెలిసిందే.

ఇదే క్రమంలో పార్ట్ 3 పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. కాగా ఇపుడు మరో భారీ స్టార్ సినిమాకి ఓటిటి కష్టాలు.. కాదు కానీ బెదిరింపులు అని చెప్పవచ్చు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాకి కష్టాలు వచ్చినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా పవన్ కళ్యాణ్ ఇపుడు చేస్తున్న చిత్రాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేసిన సినిమా "హరిహర వీరమల్లు" కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇంకా తెరకెక్కిస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో ఏపీలో రెండు ఎన్నికలు కూడా అయ్యిపోయాయి. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇలా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ భారీ సినిమా నుంచి క్రిష్ కూడా తప్పుకొని జ్యోతి కృష్ణకి భాద్యతలు అప్పగించడం కూడా జరిగింది.
ఇక ఇదిలా ఉండగా ఒకో డేట్ మారుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఓటిటి ప్రెజర్ స్టార్ట్ అయ్యిందట. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. అయితే సినిమా ఆన్ టైం తెరకెక్కకపోతుండటం రిలీజ్ కూడా అంతకంతకూ వాయిదా పడుతుండడంతో తాము ఇచ్చిన కోట్ల డీల్ ని క్యాన్సిల్ చేసుకుంటామని చెబుతున్నారట. దీనితో నిర్మాత ఏ ఎం రత్నంలో ఒకింత టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది.
ఇటీవల మేకర్స్ మే 9 డేట్ ఫిక్స్ చేసినప్పటికీ ఇప్పుడు కూడా ఆలస్యం అవుతుంది అనే టాక్ వైరల్ గా మారిన నేపథ్యంలో ఓటిటి సంస్థ ఈసారి కానీ రిలీజ్ క్లారిటీ లేకపోతే జరిగిన ఒప్పందం వెనక్కు తీసుకుంటామని చెప్పేసారట. అందుకే నేడు మేకర్స్ కొత్త పోస్టర్స్ వదిలి తాము మే 9నే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఓటిటి విషయంలో వస్తున్నా వార్తలలో ఎంతో కొంత నిజం లేదు అని చెప్పవచ్చు. మరి ఈసారి అయినా హరిహర వీరమల్లు ఆన్ టైం వస్తుందో లేదో చూడాలి. ఓ పక్క పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం లేదు. అలాగే తన పర్శనల్ లైఫ్ లో కూడా ఊహించని ఇబ్బందులు వచ్చాయి. మరి నిర్మాత ఇబ్బందిని కూడా అర్ధం చేసుకొని పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా కంప్లీట్ అయ్యి మే 9న పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











