This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే.. హారర్ టు ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరకు!
OTT Movies Web Series This Week: నానాటికీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లో సినిమాలు, వెబ్ సిరీసులు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లో విడుదల అవుతున్న సినిమాలేవే.
ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు-వెబ్ సిరీస్‌లివే?
ఓటీటీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకప్పుడు ఓటీటీలో సినిమా చూడాలంటే ఈగర్‌గా వెయిట్ చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం అయినా వారం పది రోజులో లేదా 20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇలా రావడంతో ఓటీటీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. పైగా ఇది వర్షాకాలం గత నెల రోజులుగా వర్షాలు దండికొడుతుండటంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడదు. దీంతో ఫోన్ లోనో, టీవీలోనో ఏం చక్కా కొత్త మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మరీ ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం వస్తే ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఓటీటీ సినిమాలకే పరిమితమైపోతారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ జనాలకు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వారం మొత్తం ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లు మొత్తం 9 ఉండగా.. అందులో 8 సినిమాలు, ఒక్కటి మాత్రమే వెబ్ సిరీస్ ఉంది. హారర్, కామెడీ ఇలా అన్ని జోనర్స్ కు సంబంధించి చాలా వరకు డబ్బింగ్ లో విడుదలయ్యేటివే ఉన్నాయి.
తలవన్ ..
బిజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో జిస్ జాయ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ మూవీ నేటీ (సెప్టెంబరు 10) నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. ఈ కథ క్రైమ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుంది. పోలీస్‌స్టోరీస్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మేలో రిలీజ్ ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సెప్టెంబర్ 12 నుంచి 'సోనీలివ్'(SonyLIV)లో స్ట్రీమింగ్ కానున్నది.

కమిటీ కుర్రోళ్లు చిత్రం..
మెగా డాటర్ నిహారిక నిర్మించిన మొదటి చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' మంచి టాక్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. చిన్న సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 11 మంది కుర్రాళ్లతో ఫస్ట్ టైమ్ నిహారిక సినిమా తీయడం పెద్ద సహాసమే అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ సెప్టెంబరు 11 వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల కానుంది.

మిస్టర్ బచ్చన్..
మాస్ మహారాజా రవితేజ, సెన్సెషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రం సెప్టెంబరు 12వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల కానుంది. రైడ్ అనే మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో మెరిశారు.
ఎమిలీ ఇన్ పారిస్
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎమిలీ ఇన్ పారిస్ అనే వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సిరీస్ ఎమిలీ కూపర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో లిల్లీ కాలిన్స్, లూకాస్ బ్రావో, లూసీన్ లావిస్‌కౌంట్ ముఖ్యపాత్రల్లో నటించారు. సెప్టెంబరు 12 వ తేదీన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదల కానుంది.
బెర్లిన్
క్రైమ్ అండ్ స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన హిందీ చిత్రం 'బెర్లిన్'. ఈ మూవీ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 13న డిజిటల్ ప్రీమియర్ కానుంది. 1990 లో న్యూ ఢిల్లీ నేపథ్యంలో విదేశీ గూఢచారి అనే అనుమానంతో ఓ చెవిటి-మూగ వ్యక్తిని అరెస్టు చేయడం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీకి అతుల్ సబర్వాల్ రచన దర్శకత్వం వహించగా..అపరశక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్, అనుప్రియ గోయెంకా, కబీర్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించారు.
వీటితో పాటుగా సెప్టెంబర్ 13న ఆఫీసర్ బ్లాక్ బెల్ట్, క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సెక్టార్ 36, లేట్ నైట్ విత్ డెవిల్ అనే హారర్ సినిమా లయన్స్ గేట్ ప్లే, ఓటీటీలో ఓటీటీలో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు మూవీ ఆయ్ ఇలా మొత్తం తొమ్మితి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. దీంతో ఓటీటీ ప్రియులు ఎగిరిగంతులేస్తున్నారు.


Click it and Unblock the Notifications











