twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT Releases: గురువారం రోజు ఓటీటీలో ఒకేసారి రాబోతున్న డిఫరెంట్ సినిమాలు.. రికార్డు స్థాయిలో..

    |

    ఓటిటిలో ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పోటీ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయా సంస్థలు ప్రతివారం కూడా ఒకేసారి 5 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో కూడా కంటెంట్ ను వదులుతున్నాయి. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా భారీ స్థాయిలోనే వెబ్ సిరీస్ లు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

    అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ మిగతా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కూడా అక్టోబర్ 7 బుధవారం రోజు ఒకేసారి కొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకుపోతున్నాయి. ఇక ముందుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే సిరీస్ లు సినిమాల విషయానికి వస్తే..నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం తెలుగు హిందీ తమిళ్ లో ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా స్ట్రీమింగ్ అవుతోంది. ఎంఎం కీరవాణి కొడుకు సింహ నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా బుధవారం విడుదల కాబోతోంది. ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

    ott movies release on October 7 streaming platforms details

    అలాగే గ్లిచ్ అనే ఒక కొరియన్ వెబ్ సిరీస్ కూడా మొదలు కాబోతోంది, ది జెర్రీ డాహ్మర్ టాప్స్ అనే లిమిటెడ్ సిరీస్ కూడా ఇంగ్లీషులో స్ట్రీమింగ్ కాబోతోంది. వీటితోపాటు ది మోల్ , ది మిడ్ నైట్ క్లబ్, డెర్రీ గర్ల్స్, టైగర్ అండ్ బన్నీ అనే మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. ఓల్డ్ పీపుల్ అనే జెర్మని సినిమా, డాల్ హౌస్ అనే ఫిలిప్పీన్ మూవీ, కేవ్ ఆడమ్స్ అనే సినిమాలు గురువారం స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి.

    గురువారం స్ట్రీమింగ్ కాబోయే కంటెంట్స్ లో ఆమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందినవి కూడా ఉన్నాయి. కన్నడ మూవీ లక్కీ మ్యాన్, హిందీ మూవీ మజా మా, ది సౌండ్ ఆఫ్ 007 అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. ప్రే అనే ఒక ఇంగ్లీష్ మూవీ రాబోతోంది. హిందీలో కూడా ఆ సినిమా విడుదల కానుంది. వేర్ వోల్ఫ్ బై నైట్ అనే మరో ఇంగ్లీష్ సినిమాతో పాటు ఎక్స్ పొజిడ్ అనే సీరీస్ బుధవారం రోజు స్ట్రీమింగ్ కానుంది.

    English summary
    ott movies release on October 7 streaming platforms details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X