నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్ గురించి తెలుసా? ఇంటర్నెట్‌తో పనిలేదు.. నచ్చిన సినిమా ఎలా చూడొచ్ఛంటే?

కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ మార్కెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నాడు గుమ్మం దాటి అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో ఇంటిల్లిపాదికి ఓటీటీయే దిక్కయ్యింది. దీంతో భాషాభేదాలు లేకుండా ఒరిజినల్ కంటెంట్‌ చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అయితే కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా మంది ఓటీటీల నుంచి బయటకు రాలేకపోయారు. థియేటర్లలో టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేవారు.

కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూడాలంటే రూ.2 నుంచి రూ.3 వేలకు వదిలించుకోవాల్సి వచ్చింది. దీనికి పాప్‌కార్న్, సమోసా ఖర్చులు అదనం. అంత ఖర్చు పెట్టే స్తోమత లేక కేవలం రూ.1000 లేదా రూ.1200తో ఏడాది మొత్తం ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు చూసే సౌలభ్యం ఉన్న ఓటీటీని ప్రజలు ఆదరించారు. ఓటీటీ రంగంలోకి అప్పటికే ఉన్న సంస్థలకు తోడు కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయడంతో పోటీ పెరిగింది.

OTT News How to download movies and shows for offline viewing in Netflix here s the details

ఈ క్రమంలోనే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా వినియోగదారులు తమకు ఇష్టమైన ఓటీటీ కంటెంట్‌ను వీక్షించాలంటే ఇప్పుడు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా టారీఫ్‌లను భారీగా పెంచడంతో ప్రేక్షకుడిలో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అరుదైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఆఫ్‌లైన్‌లోనే సినిమాలు, షోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్నిఅందిస్తోంది.

ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే .. కొన్ని సినిమాలు, షోలను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ అనుమతిస్తోంది. ఇది ఒకసారి లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ అయితే వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు , వారు కోరుకున్న ప్రాంతంలో వాటిని వీక్షించవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. ఈ ఫీచర్ నిర్ధిష్ట పరిమితులతో అన్ని నెట్‌ఫ్లెక్స్ ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. బేసిక్ ప్లాన్ .. ఒక డివైస్‌లోనే ఈ సదుపాయాన్ని అనుమతిస్తుంది . అదే హై టైర్ ప్లాన్ అయితే ఒకేసారి ఆరు డివైస్‌లలో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

OTT News How to download movies and shows for offline viewing in Netflix here s the details

అండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ మ్యాక్, అప్‌డేట్ చేసిన విండోస్, వెబ్ వెర్షన్‌లు దీనిని సపోర్ట్ చేయలేవు. అలాగే మీ ఫోన్ మెమొరీ స్టోరేజ్ కూడా ఇందుకు అనుగుణంగా ఉండాలి, లేనిపక్షంలో ఈ ఫీచర్ పనిచేయదు. ఒకసారి డౌన్‌లోడ్ అయిన కంటెంట్‌కు ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంది. గడువు ముగిసిన తర్వాత దానిని చూడాలనుకుంటే మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలి. నెట్‌ఫ్లిక్స్‌లో స్మార్ట్ డౌన్‌లోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది చూసే వీక్షణల ఆధారంగా ఎపిసోడ్‌లను ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. ఒకసారి యూజర్లు దానిని చూసిన తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

మీ అండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను లాంచ్ చేసి .. మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. అందులో మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న చలనచిత్రం లేదా షోను ఎంచుకుని డౌన్‌లోడ్ బటన్ నొక్కండి. డౌన్‌లోడ్ చేసిన కంటెంట్‌ను చూడాలనుకుంటే.. నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లి మై నెట్‌ఫ్లిక్స్ > డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి మీరు చూడాలనుకుంటున్న మూవీ లేదా షో పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ డౌన్‌లోడ్‌ల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు, అవసరమైతే డౌన్‌లోడ్‌లను క్యాన్సిల్ , డిలీట్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లను డిలీట్ చేయాలనుకుంటే .. నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లి మై నెట్‌ఫ్లిక్స్ > డౌన్‌లోడ్‌లోకి వెళ్లండి. మీరు తొలగించాలనుకుంటున్న వీడియోపై ఎడమవైపుకు స్వైప్ చేసి అక్కడ X బటన్ నొక్కండి.

More from Filmibeat

Read more about: ott news netflix ott releases
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X