పవన్ సినిమా రిలీజ్ ఎప్పుడు? నిర్మాతపై ప్రముఖ ఓటిటి ఒత్తిడి?
రెండు తెలుగు రాష్ట్రాల వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రెండో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అంటే ఇపుడు అది ఒక్క పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎప్పుడో 2008 లోనే అడుగు పెట్టినప్పటికీ ఇన్నేళ్ల తర్వాత దాదాపు 90 శాతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అభిమానులు కోరుకున్న స్థానానికి దగ్గరయ్యారు.
కాగా ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండి రాజకీయాల్లో ఉంటే ఒక గోల ఇపుడు రాజకీయాల్లో ఉండి సినిమాల్లో ఉంటే ఒక గోల అన్నట్టుగా పవన్ పరిస్థితి మారిపోయింది. కాగా పవన్ ని నమ్మి ఇపుడు ఏకంగా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది కూడా పవన్ ఇపుడు పూర్తి చేసే మూడ్ లో కనిపించడం లేదు.

అయితే రాజకీయాలు లేదా పుణ్య క్షేత్రాలు అంటూ తిరుగుతున్న పవన్ డేట్స్ కోసం ఈ మూడు సినిమాలు ఎదురు చూస్తున్నాయి. కాగా ఆ చిత్రాలే దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఓజి అలాగే దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న హరిహర వీరమల్లు అలానే దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మాస్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కాగా ఈ మూడు సినిమాలూ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఆగిపోయినవే.
అలానే ఎప్పుడు మొదలవుతాయి అనేది కూడా అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే సినిమాలు అనేవి బయటకి కనిపించినంత సున్నితమైన మేటర్ కాదు. ఇది చాలా పెద్ద బిజినెస్. ఇపుడు ఇదే బిజినెస్ పవన్ కొంప ముంచేలా ఉందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పవన్ చేస్తున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు ఇపుడు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందే అని నిర్మాతలపై ప్రముఖ ఒత్తిడి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ప్రెజర్ చేస్తున్నారట.

మెయిన్ గా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాదిలోనే తర్వగా స్టార్ట్ చేసి రిలీజ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. కాగా హరిహర వీరమల్లు సినిమా కూడా వారే దక్కించుకున్నారు కానీ ఈ సినిమా దాదాపు పూర్తయ్యిపోయింది. సో అవుట్ పుట్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు కానీ దీనితో పాటుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో మాత్రం వారు నిర్మాతలపై సీరియస్ గా ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇపుడు దాదాపు సినిమాలు అన్నీ ఓటిటి డీలింగ్స్ తోనే వాటి భవిష్యత్తు డిసైడ్ అవుతున్నాయి. అందుకే ఇపుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇంత లేట్ అవుతుంది అని ప్రెజర్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా వీరికే ఓసారి ఓటిటి ఇష్యూ వచ్చే రవితేజతో అనౌన్స్ చేసిన సినిమా కూడా ఆపేయాల్సి వచ్చింది. సో ఓటిటిలు ఇపుడు ఓ సినిమా విషయంలో అంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి పవన్ ఏమన్నా కరుణించి డేట్స్ ఇస్తే తప్ప ఇవన్నీ ఒక కొలిక్కి రావని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











