OTT : పర్యావరణానికి , హత్యలకి లింకేంటీ.. ఓటీటీలోకి జగపతి బాబు - అనసూయ క్రైమ్ థిల్లర్, ఎందులో అంటే..?
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా గుర్తుందా. ప్రకృతి, పర్యావరణం ఇతివృత్తంగా తీసిన సింబా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ అంశాలను మిక్స్ చేసి రూపొందించారు. జగపతి బాబు నటించడంతో సినిమాకు బజ్ వచ్చింది. ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింబాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసింది. ఆ వివరాలేంటో చూస్తే :
తెలుగునాట దర్శకుడిగా చేస్తూనే కథలు అందించే వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ బాటను అనుసరిస్తున్నారు సంపత్ నంది. ఈ క్రమంలోనే బాయ్, గాలిపటం వంటి చిన్న సినిమాలకు కథలు అందించారు. తన శిష్యుల్లో ఎవరైనా దర్శకుడిగా మారితే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలోనే సింబాకు సంపత్ నంది కథని సమకూర్చగా.. ఆయన వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ట్రైలర్, టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సింబా కోసం పలువురు ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి తోడు ప్రమోషన్ ఈవెంట్‌లో అనసూయ .. హీరో విజయ్ దేవరకొండతో ఉన్న వివాదాన్ని టచ్ చేయడంతో ఇండస్ట్రీ ఈ సినిమాపై ఫోకస్ చేసింది. గతంలో ఈ స్టార్ యాంకర్‌కి, రౌడీ స్టార్ ఫ్యాన్స్‌కి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని , ట్రోలింగ్‌కు దిగుతున్నారంటూ అనసూయ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. తర్వాత కొద్దిరోజులకు ఈ గొడవ సద్దుమణిగింది.
సింబాలోని ఓ సీన్‌లో అనసూయ టూ వీలర్‌పై వస్తుండగా , ఒక వ్యక్తి వచ్చి.. అక్క నీకు మహేష్ బాబు లాంటి మొగుడొస్తాడని చెబుతాడు. దీనికి అనసూయ ఫేస్ డల్ అయిపోతుంది. దీనిని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే అక్కా నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడని చెప్పడంతో ఆమె ముఖం ట్యూబ్ లైట్‌లా వెలిగిపోతుంది. తీరా సినిమాపై ఎన్నో అంచనాల మధ్య సింబా థియేటర్ల మధ్యలోకి రాగా దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. పర్యావరణాన్ని రక్షించాలనే సోషల్ ఎలిమెంట్స్‌ను జోడించి సంపత్ నంది మంచి కథను రాసినా స్క్రీన్ ప్రజెంటేషన్ అంతగా బాలేదని రివ్యూలు వచ్చాయి.
అనసూయ, దివిలు వరుసపెట్టి హత్యలు చేస్తుండటంతో వారు నగరంలో పేరున్న ఓ బిజినెస్‌మెన్‌కు సంబంధించిన వాళ్లు కావడంతో కేసు మిస్టరీగా మారుతుంది. ఆ బిజినెస్‌మెన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు, మధ్యలో జగపతిబాబుకు స్టోరీకి లింక్ ఏంటీ అన్నదే సింబా కథ. ఈ మూవీలో శ్రీనాథ్ మాగంటి, కబీర్ సింగ్, దివి, గౌతమి, కస్తూరిలు కీలకపాత్ర పోసించారు. థియేటర్లలో సింబా కోటి రూపాయల లోపే బిజినెస్ క్లోజ్ చేసి నిరాశపరిచింది. థియేటర్లలో రిలీజైన నెల తర్వాత ఈ సినిమా ఓటీటీ బాటపట్టింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో సెప్టెంబర్ 6 నుంచి సింబా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేకు ఆహా అధికారికంగా అనౌన్స్ చేసింది. మరి ఓటీటీలో సింబాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











