OTT Releases This Week: నాని, కమల్ హాసన్ రెడీ.. మరో మూడు ఆసక్తికరమైన సినిమాలు

థియేట్రికల్ గా అంతగా సక్సెస్ కానీ సినిమాలు ఓటీటీ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంటున్నాయి. ఆడియెన్స్ కూడా చాలా వరకు థియేటర్స్ లో కంటే కూడా కొన్ని సినిమాలను ఓటీటీ లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఈవారం ఓటీటీ లోకి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎక్కువగా బై లాంగ్యువల్ సినిమాలు ఉన్నాయి. ఇక అందులో అంటే సుందరనికి సినిమాతో పాటు విక్రమ్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

విక్రమ్ ఎప్పుడంటే?

విక్రమ్ ఎప్పుడంటే?


కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యధిక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా స్థాయిలో 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో కమలహాసన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే విక్రమ్ సినిమాను ఓటీటీలో కాస్త ఆలస్యంగానే విడుదల చేస్తూ ఉన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 8వ తేదీన విక్రమ్ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ మలయాళం కన్నడ మలయాళం భాషల్లో కూడా విడుదలవుతోంది.

అంటే.. సుందరానికి

అంటే.. సుందరానికి

ఇక నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికి' సినిమా ఈపాటికే ఓటీటీ లో విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ నిర్మాతలు మాత్రం థియేటర్లో సినిమా ఎక్కువ రోజులు ఉండాలి అని ఆలోచనతో నెట్ ఫ్లిక్స్ లోకి చాలా ఆలస్యంగానే విడుదల చేస్తోంది. ఈ సినిమా ధియేటర్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈనెల 10వ తేదీన తెలుగు తమిళం మలయాళం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

జై భజరంగీ

జై భజరంగీ

ఇక ఇటీవల కన్నడలో భారీ స్థాయిలో విడుదలైన జై భజరంగి సినిమా కూడా తెలుగులో విడుదలవుతూ ఉండడం విశేషం. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆహాలో జూలై 8న తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాను కూడా చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాక: రివర్ ఆఫ్ బ్లడ్'

పాక: రివర్ ఆఫ్ బ్లడ్'

ఇక మలయాళం లో గత ఏడాది మంచి గుర్తింపును అందుకున్న థ్రిల్లర్ మూవీ 'పాక రివర్ ఆఫ్ బ్లడ్' సినిమా కూడా సోనీ లీవ్ లో ఈ నెల 7వ తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. బాసిల్ పాలోస్ వినిత కోషి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఇప్పుడు ఓటీటీ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ దర్శకుడు నితిన్ లుకోసే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

మరో మలయాళం మూవీ 'కుంజేల్దో'

మరో మలయాళం మూవీ 'కుంజేల్దో'

అలాగే మలయాళం లో 2021 లో వచ్చిన 'కుంజేల్దో' సినిమా కూడా విమర్శకుల ప్రశంసలతో థియేటర్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు జి 5 లో మలయాళం భాషలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ముతుకుట్టి దర్శకత్వంలో దొరికేక్కిన ఈ సినిమాలో గోపిక, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రులో నటించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X