OTT Releases: ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఈ వారం సినిమా పండగే!

OTT Releases: సినీ ప్రేమికులకు ఈ వారం నిజంగానే పండుగ అనే చెప్పాలి. ఒక వైపు థియేటర్లలో కొత్త సినిమాలు, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో బ్లాక్‌బస్టర్ మూవీస్, ఫ్రెష్ వెబ్‌సిరీస్‌లు వరుసగా స్ట్రీమింగ్‌కి వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన టాప్ మూవీస్, సిరీస్‌ల జాబితాపై ఓ లూక్కేయండి.

బైసన్ (Bison)
కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ తీసిన మూవీ 'బైసన్'. ఈ మూవీ తమిళంలో భారీ విజయం సాధించింది. తరువాత తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు కొట్టేసింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా, పశుపతి, లాల్, అమీర్ సుల్తాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

OTT Releases Blockbuster Movies Trending Web Series Streaming This Week

ది ఫ్యామిలీ మ్యాన్ 3 (The Family Man 3)
మనోజ్ బాజ్‌పేయి పోషించిన శ్రీకాంత్ తివారి పాత్ర ఇప్పటికే దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు అదే ఎమోషన్, అదే స్పై థ్రిల్ తో వచ్చింది 'ఫ్యామిలీ మ్యాన్ 3'. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఫైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. జాతీయ భద్రత, కుటుంబం, వ్యక్తిగత భావోద్వేగాల మధ్య జరిగే హై డ్రామా ఈ సీజన్‌లో మరింత హైగా ఎక్కిందని రివ్యూలు చెబుతున్నాయి.

నాడు సెంటర్ (Nadu Center)
దక్షిణ తమిళనాడులోని యువత రాజకీయ-సామాజిక రంగంలో ఎలా చిక్కుకుపోతుందో చూపించే యూత్ పాలిటిక్స్ డ్రామా. శశికుమార్, రెజీనా కాసాండ్రా, కలైయరసన్, సూర్య (విజయ్ సేతుపతి కుమారుడు) కీలక పాత్రల్లో నటించారు. నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పుడు జీయో హాట్ స్టార్ ( Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇదోక ప్రత్యేకమైన మూవీ అనే చెప్పాలి.

హోంబౌండ్ (Homebound)
2026 ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ఇండియా నుంచి ఎంపికైన సినిమా 'హోంబౌండ్'. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హర్రర్, మెంటల్ ఎమోషన్‌లపై రాసుకున్న ఈ స్టోరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్ (Netflix)లో టాప్ టెన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ది కశ్మీర్ ఫైల్స్ (The Bengal Files)
'ది కశ్మీర్ ఫైల్స్' తర్వాత వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన సెన్సిటివ్ డ్రామా 'ది బెంగాల్ ఫైల్స్'. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం Zee5లో అందుబాటులో ఉంది. అయితే.. ప్రస్తుతం హిందీ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

థియేటర్స్‌లో కూడా సందడి
ఈ వారం థియేటర్స్ లో '12ఏ రైల్వే స్టేషన్', 'ప్రేమంటే', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అంతేకాకుండా క్లాసిక్ ఫ్యాన్స్ కోసం 'కొదమ సింహం' 4K రీరిలీజ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద సినీ లవర్స్ కు అటు ఓటీటీల్లోనూ, ఇటు థియేటర్ ల్లోనూ సినిమా పండగే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X