OTT Releases: ఒక్కరోజే 4 బ్లాక్ బస్టర్ మూవీస్ సందడి.. ఓటీటీలో ఎన్టీఆర్ దేవరతో పాటు..
This Week OTT Releases: రోజురోజుకు ఓటీటీల క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం కన్నా.. ఇంట్లో కూర్చుని.. హాయిగా నచ్చిన మూవీలను చూడాలని చాలా మంది భావిస్తుంటారు. దీంతో ఓటీటీ లవర్స్ ను మరింత ఆకర్షించేందుకు డిఫరెంట్ జోనర్ మూవీస్ ను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇలా ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం భారీ బడ్జెట్ మూవీస్, బ్లాక్ బస్టర్ మూవీస్ విడుదల అవుతున్నాయి. ఈ సినిమాలోంటే..ఓ లూక్కేయండి.
ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలతో ఓటీటీ కళకళలాడిపోతోంది. ఎందుకంటే ఈ వారం ఏకంగా ఐదు బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇలా పలువురు స్టార్ హీరోహీరోయిన్లు నటించిన సినిమాలు ఓటీటీలో ప్రత్యేక్షం కానున్నాయి. ఇంతకీ బ్లాక్ బస్టర్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నాయంటే?

దేవర
పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. దేవర సినిమాని ఏకంగా 150 కోట్లకి పైగా వెచ్చించి ప్రపంచ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అది కూడా పాన్ ఇండియా భాషల్లో అని తెలిసిందే. దేవర నవంబర్ 8 (నేటీ)నుంచే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నది.
వేట్టయన్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్ ది హంటర్ (Vettaiyan). ఈ భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్ 10 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మల్లీ స్టారర్ మూవీ 'వేట్టయన్' అమెజాన్ ప్రైమ్‌లోకి నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

జనక అయితే గనక
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'(janaka aithe ganaka). సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో సుహాస్, సంకీర్తన హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. జనక అయితే గనుక ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. నవంబర్ 8 నుంచి జనక అయితే గనుక అందుబాటులోకి వస్తుంది.
సిటాడెల్: హనీబన్నీ
స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా లీడ్ రోల్ నటించిన యాక్షన్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'(Citadel: Honey Bunny). ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' లాంటి సక్సెస్ పుల్ సిరీస్‌లను డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు ఈ సిరీస్ రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేకే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి.
ఏఆర్ఎమ్ ఓటీటీ
మలయాళ డబ్బింగ్ సినిమా ఏఆర్ఎమ్. పీరియాడికల్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ మూవీలో పాపులర్ హీరో టొవినో థామస్ నటించగా.. తెలుగు బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఏఆర్ఎమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 106 కోట్ల వరకు కలెక్ట్ చేసిన పలు రికార్డులను బ్రేక్ చేసింది.
ఈయాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఏఆర్ఎమ్ కు జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ సాధించిన ఏఆర్ఎమ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 8 నుంచి అందుబాటులోకి రానున్నది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











