OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు,వెబ్ సిరీస్‌లివే.. అస్సలు మిస్ కాకండి
OTT Releases This Week: రోజురోజుకు ఓటీటీ హావా పెరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌పై విడుదలయ్యే సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. థియోటర్లో సినిమా చూసేవారికి కంటే ఓటీటీలో సినిమాలు,వెబ్ సిరీస్‌లు చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కొన్ని సినిమాలయితే థియేటర్‌లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి.చాలామంది థియేటర్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఏం చక్కా ఫోన్‌లోనో..టీవీలోనో తమకు ఇష్టమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. అలా ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లూక్కేద్దాం..
ఈ మధ్యకాలంలో థియేటర్‌లలో సినిమా చూడటానికి కొంత మంది పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మెయిన్ గా సరైన టైం లేకపోవడం. మరొకటి బడ్జెట్ ప్రాబ్లమ్. ఎంత హిట్ అయినా సినిమా అయినా సరే 20 లేదా 30 రోజుల్లో ఓటీటీలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉండి సినిమాలు చూడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మంచిగా.. పాప్‌కార్న్, బజ్జీలు, బిస్కెట్స్ లాంటి స్నాక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ వారం ఓటీటీలో మిమ్ములను ఎంటర్టైన్ చేయడానికి మూవీస్ సిద్దమయ్యాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూడండి.

ఈ వారం ఓటీటీ లోకి విడుదల కాబోతున్నసినిమాలు - వెబ్ సిరీస్ లిస్ట్..
డిస్నీ + హాట్‌స్టార్
1. అన్‌ప్రైసన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) - సెప్టెంబర్ 16
2. అగాథ: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (వెబ్‌సిరీస్) - సెప్టెంబర్ 18
3. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబర్ 20
4. ది జడ్జ్ ఫ్రమ్ హెల్ (వెబ్‌సిరీస్) - సెప్టెంబర్ 21
అమెజాన్ ప్రైమ్
1. ఎ వెరీ రాయల్ స్కాండిల్ ( ఇంగ్లీష్ వెబ్‌సిరీస్) సెప్టెంబరు 19
2. తలైవెట్టయామపాళ్యం (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 20
నెట్‌ఫ్లిక్స్
1. గ్రేవ్ టార్చర్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 16
2. క్యులినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) సెప్టెంబరు 17
3. ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 18
4. మాన్‌స్టర్స్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 19
5. ది క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబర్ 19
6. తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబర్ 20
7. హిజ్ త్రీ డాటర్స్ (హాలీవుడ్) సెప్టెంబరు 20
8. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో2 (హిందీ రియాలిటీ షో) సెప్టెంబరు 21
9. ఈవిల్ డెడ్ రైజ్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 21
ఆహా
1. హై ఆన్ కాదల్ (తమిళ్) - సెప్టెంబర్ 16
2. తిరగబడరా సామి (తెలుగు) - సెప్టెంబర్ 19
3. మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు ) - సెప్టెంబర్ 20
జియో సినిమా
దుర్గ (హిందీ) సెప్టెంబరు 16
జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20
ది పెంగ్విన్ (వెబ్‌సిరీస్) (సెప్టెంబరు 29
1.దుర్గ (హిందీ) సెప్టెంబరు 16
2. జో తేరా హై వో మేరా హై (హిందీ) - సెప్టెంబర్ 20
3. ది పెంగ్విన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 20
థియేట్రికల్ రీలిజ్
ఇదిలాఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరెకెక్కిన మూవీ 'దేవర'. ఈ మూవీ వచ్చే వారం భారీ అంచనాల నడుమ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీ రిలీజ్ సందడి..
మరో వైపు.. ఈ వారంలో రీ రిలీజ్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాయి. అందులో మెయిన్ గా బొమ్మరిల్లు. ఈ మూవీ 2006లో ఫ్యామిలీ ఎంటర్టైన్ గా వచ్చింది భారీ సక్సెస్ అందుకుంది. సిద్ధార్థ్,జెనీలియ జంటగా నటించిన ఈ మూవీకి భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబరు 21న పలుథియేటర్స్‌లో రీ-రిలీజ్ కాబోతుంది.
ఇక వెంకీ.. మాస్ మహారాజ రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'వెంకీ'. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ రవితేజ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా సెప్టెంబరు 21న రీ-రిలీజ్ కానుంది. ఇక జర్నీ ఈ మూవీ జై ,శర్వానంద్,అంజలి,అనన్య ప్రధాన పాత్రలో నటించిన మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబరు 21న ఈ సినిమా కూడా రీ- రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











