OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న టాప్ సినిమాలు..
OTT Releases This Week: ఓటీటీ హావా రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌పై విడుదలయ్యే సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. థియోటర్లో సినిమా చూసే వారి కంటే.. ఓటీటీలో సినిమాలు,వెబ్ సిరీస్‌లు చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు అయితే.. థియేటర్‌లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. చాలా మంది థియేటర్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఏం చక్కా ఫోన్‌లోనో..టీవీలోనో తమకు ఇష్టమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. అలా ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లూక్కేద్దాం..
ఈ మధ్యకాలంలో థియేటర్‌లలో సినిమా చూడటానికి కొంత మంది పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మెయిన్ గా సరైన టైం లేకపోవడం. మరొకటి బడ్జెట్ ప్రాబ్లమ్. ఎంత హిట్ అయినా సినిమా అయినా సరే 20 లేదా 30 రోజుల్లో ఓటీటీలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీంతో చాలామంది ఇంట్లోనే ఉండి సినిమాలు చూడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా ఈ వారం ఓటీటీలో మిమ్ములను ఎంటర్టైన్ చేయడానికి మూవీస్ సిద్దమయ్యాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో చూడండి.

సరిపోదా శనివారం
ఈ లిస్ట్ లో తొలి వచ్చేంది సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ నిలిచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళు చేసింది. ఈ మూవీ ఈ గురువారం అంటే..సెప్టెంబర్ 26 న నెట్‍ఫ్లిక్స్ లో దర్శమివ్వనున్నది. కేవలం తెలుగుతో కాకుండా.. హిందీ, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. సూపర్ హిట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరక్కెకించిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 27వ తేదీన వర్డల్ వైడ్ గా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా రూ.100కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 26 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చేస్తుంది. డోట్ మిస్..
డిమోంటీ కాలనీ 2
డెమోంటే కాలనీ 2 అనే హారర్ థ్రిల్లర్ మూవీ.. 2015 లో హిట్ అయిన ఈ డిమోంటీ కాలనీ మూవీకి సీక్వెల్. ఈ మూవీ తమిళంలో ఆగస్టు 15న విడుదలైన తరువాత వారానికి తెలుగులో రిలీజైంది. ఈ హారర్ మూవీ 'డిమోంటీ కాలనీ 2' జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీక్వెల్ మూవీకి మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లలను అందకుంది. ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో కనించారు.
వాళై
తమిళ చిల్ట్రన్ డ్రామా మూవీ 'వాళై' మూవీ సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నది. కర్ణమ్, మామన్నన్ సినిమాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. స్నేహితులైన చిన్నారుల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆగస్టు 23న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. వాళై సినిమాలో పోన్వెల్, రఘుల్, కలైయారాసన్, నిఖిల విమల్, కర్ణన్ జానకీ ప్రధాన పాత్రలో కనిపించారు.

లవ్ సితార
శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన 'లవ్ సితార' మూవీ నేరుగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రానికి వందన కటారియా దర్శకత్వం వహించారు. లవ్ సితార చిత్రంలో రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్ లో కనిపిస్తున్నారు.
కథల్ - రొమాంటిక్ డ్రామా
కథల్ మూవీలో మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ మూవీ సాగుతోంది. ఈ మూవీకి జియో బేబీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబరు 2024 చివరిలో నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించనున్నది.


Click it and Unblock the Notifications











