OTT Releases This Week: ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్ సందడి.. ఆ మూవీని తప్పక చూడండి
OTT Releases This Week: ఓటీటీల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. థియోటర్లో సినిమా కంటే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు అయితే.. థియేటర్‌లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుండటం. అలాగే.. సరైన టైం లేకపోవడం, బడ్జెట్ ప్రాబ్లమ్, ఎంత హిట్ అయినా సినిమా అయినా సరే 20 లేదా 30 రోజుల్లో ఓటీటీలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీంతో చాలా మంది ఓటీటీ కంటెంట్ కే ఓటేస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఏంచక్కా ఫోన్‌లోనో..టీవీలోనో తమకు ఇష్టమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. ఇలా ఈ వారం ఓటీటీలో మిమ్ములను ఎంటర్టైన్ చేయడానికి మూవీస్ సిద్దమయ్యాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లూక్కేయండీ.
సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ నిలిచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళు చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 26(నేడు) నుంచి నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నది. కేవలం తెలుగుతో కాకుండా.. హిందీ, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. సూపర్ హిట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరక్కెకించిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 27వ తేదీన వర్డల్ వైడ్ గా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా రూ.100కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేటీ నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది . ఆ మూవీని తప్పక చూడండి.

ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ 'ప్రతినిధి 2' (Prathinidhi 2). 2014లో రిలీజై విమర్శకుల ప్రశంసలను అందుకున్న ప్రతినిథి మూవీకి సీక్వెల్‌గా ప్రతినిధి 2 వచ్చింది. ఈ మూవీకి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించాడు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 (Prathinidhi 2 OTT Release) నుంచి 'ఆహా' (Aha)లో స్ట్రీమింగ్ కానుంది.
డిమోంటీ కాలనీ 2
'డిమోంటి కాలనీ 2' (Demonte Colony 2) 2015 లో హిట్ అయిన ఈ డిమోంటీ కాలనీ మూవీకి సీక్వెల్. ఈ మూవీ తమిళంలో ఆగస్టు 15న విడుదలైన తరువాత వారానికి తెలుగులో రిలీజైంది. ఈ మూవీలో అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో నటించగా.. ఆర్. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ హారర్ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
వాళై
తమిళ చిల్ట్రన్ డ్రామా మూవీ 'వాళై'. ఈ మూవీ కూడాసెప్టెంబర్ 27 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నది. కర్ణమ్, మామన్నన్ సినిమాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. స్నేహితులైన చిన్నారుల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆగస్టు 23న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. వాళై సినిమాలో పోన్వెల్, రఘుల్, కలైయారాసన్, నిఖిల విమల్, కర్ణన్ జానకీ ప్రధాన పాత్రలో కనిపించారు.

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌మూవీ 'స్త్రీ2'. బాలీవుడ్ నటీనటులు శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) జంటగా నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ మూవీ ఓటీటీలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు. ఈ సినిమా సుమారు రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.
లవ్ సితార
శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటించిన 'లవ్ సితార' మూవీ నేరుగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రానికి వందన కటారియా దర్శకత్వం వహించారు.ఈ మూవీలో రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్ లో కనిపిస్తున్నారు. హాస్యం, భావోద్వేగం ప్రధానంగా సినిమా రూపొందింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్)
డైవర్స్ (పోలిష్)
పెనెలోప్ (వెబ్‌సిరీస్)
హెవెన్ అండ్ హెల్ (ఇంగ్లీష్)
ది ట్రూ జెంటిల్‌మెన్ (ఇంగ్లీష్)
రెజ్‌బాల్ (హాలీవుడ్) సెప్టెంబరు 27
విల్ అండ్ హార్పర్ (హాలీవుడ్) సెప్టెంబరు 27
ఐలా వై లాస్ మిర్రర్ (స్పానిష్)
మిస్టర్ మెక్‌మాన్ (ఇ)
అమెజాన్ ప్రైమ్ వీడియో
స్కూల్ ఫ్రెండ్స్(హిందీ సిరీస్)
నోబడీ వాంట్స్ దిస్ (వెబ్‌సిరీస్)
కిల్లర్ హీట్ (ఇంగ్లీష్) - ప్రైమ్
ఎమర్జెన్సీ ల్యాండింగ్ (రష్యన్)
ప్రభుత్వా జూనియర్ కళాశాల (తెలుగు)
డిస్నీ+హాట్‌స్టార్
గ్రోటీ స్క్వేర్ (హాలీవుడ్)
తాజా ఖబర్2 (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 27
బ్లింక్ (తమిళ్ డబ్) - ఆహా
ఆర్టీఐ (తెలుగు)- Etv విన్
ది హీస్ట్ (హిందీ) - జియో సినిమా
భరతనాట్యం (మలయాళం) - మనోరమ మాక్స్


Click it and Unblock the Notifications











