OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. ధురందర్ 2 నుంచి ఒబ్సెషన్ వరకు భారీ లైనప్!

OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు నిజంగా పండగే అని చెప్పాలి. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల నుంచి హారర్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీల వరకు పలు రకాల కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వ‌స్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు లిస్ట్ మీ కోసం!

ధురందర్ 2: ది రివెంజ్ (Dhurandhar 2)
అందరిలో ఎక్కువగా చర్చకు వస్తున్న సినిమా 'ధురందర్ 2: ది రివెంజ్'. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీలో ప్రత్యేక ఎక్స్‌టెండెడ్ ఎడిషన్ అందుబాటులోకి రానున్నది. దీంతో అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ఎక్స్ట్రా సీన్స్ జోడించబడటం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

OTT Releases This Week Dhurandhar 2 Obsession Patriot Top Movies Streaming Now

పేట్రియాట్ (Patriot)
మలయాళ సినీ పరిశ్రమలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా పేట్రియాట్ . ఈ సినిమా కూడా ఈ వారంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దేశ భద్రత, రాజకీయ కుట్రలు, సైబర్ టెక్నాలజీ నేపథ్యంలో సాగే ఈ కథలో ఫహాద్ ఫాజిల్, నయనతార కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి కనిపించే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే అవకాశముంది.

ఒబ్సెషన్ (Obsession)
ఈ వారం అత్యంత ఆసక్తికరమైన ఓటీటీ స్ట్రీమింగ్ లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'ఒబ్సెషన్' కూడా ఒకటి. కేవలం 1 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. హారర్ జానర్‌లో అరుదుగా కనిపించే ఈ విజయం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా జూన్ 2 నుంచి PVOD ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదలైన కేవలం కొన్ని రోజులకే ఓటీటీలోకి రావడం ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మార్చింది.

కేడీ: ది డెవిల్ (KD The Devil)
కన్నడ స్టార్ ధృవ్ సర్జా నటించిన 'కేడీ: ది డెవిల్'కూడా జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మంచి స్పందన పొందుతుందనే ఆశలు చిత్రబృందంలో ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది.

మా బెహెన్ (Maa Behan)
నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ వారం భారీ కంటెంట్‌తో ముందుకొస్తోంది. అందులో ముఖ్యంగా 'మా బెహెన్' అనే డార్క్ కామెడీ-క్రైమ్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లెజెండరీ నటి మాధురీ దీక్షిత్, యంగ్ స్టార్ తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒక అనుకోని నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో తల్లి, కూతుళ్లు ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనను చూస్తే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్ సాధించే అవకాశం కనిపిస్తోంది.

ఆఫీస్ రొమాన్స్ (Office Romance)
రొమాంటిక్ కామెడీ అభిమానుల కోసం 'ఆఫీస్ రొమాన్స్' సిద్ధమైంది. జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఆఫీస్‌లో రహస్య ప్రేమ కథ కారణంగా ఇద్దరు ఉద్యోగుల జీవితాల్లో చోటు చేసుకునే సరదా సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హాలీవుడ్ రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా మారనుంది.

ఇక ఇవే కాకుండా.. ఇక డాక్యుమెంటరీల అభిమానులకు కూడా ఈ వారం ప్రత్యేక కంటెంట్ సిద్ధమైంది. జర్మనీ ఫుట్‌బాల్ స్టార్ లూకాస్ పోడోల్స్కీ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'పోల్డి' డాక్యుమెంటరీ జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతని ఫుట్‌బాల్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రపంచ కప్ ప్రయాణం వంటి అంశాలను ఇందులో చూపించనున్నారు. అలాగే 'మెక్సికో 86'అనే కామెడీ-డ్రామా చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన మెక్సికో వెనుక ఉన్న కథను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇందులో కనిపించనుంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఆసక్తికర అనుభూతిని అందించే అవకాశం ఉంది.

కోరియన్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామా 'టీచ్ యు ఎ లెసన్' కూడా జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, ఎమోషన్, రివెంజ్ అంశాలతో కూడిన ఈ సిరీస్ యువతను ఆకట్టుకునే అవకాశముంది. అదే విధంగా కామెడీ-డ్రామా సిరీస్ 'నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్', ఫ్రెంచ్ కామెడీ షో 'హాట్ సీట్' వంటి షోలు కూడా ఈ వారం ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. విభిన్నమైన కథాంశాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు, ప్రముఖ నటీనటుల భాగస్వామ్యం కారణంగా ఈ కంటెంట్‌పై కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ ప్రపంచంలో భారీ సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ కంటెంట్‌తో ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందబోతోంది. యాక్షన్ అభిమానులకు 'ధురందర్ 2', 'కేడీ ది డెవిల్', 'పేట్రియాట్' ఉండగా, హారర్ ప్రియులకు 'ఒబ్సెషన్', కామెడీ ప్రేక్షకులకు 'మా బెహెన్', 'ఆఫీస్ రొమాన్స్' వంటి సినిమా సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ వారం ఓటీటీ ప్రేమికులకు 'బింజ్ వాచ్ వీక్' అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Read more about: ott news netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X