OTT Releases This Week: ఓటీటీలో వినోదాల విందు .. దృశ్యం 3 నుంచి సేవ్ ది టైగర్స్ 3 వరకు భారీ రిలీజ్‌లు!

OTT Releases This Week: ప్రస్తుతం థియేటర్లలో భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నా.. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాయి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని భావించే ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో ఓటీటీ మార్కెట్ మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జూన్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త కంటెంట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కాబోతున్న థ్రిల్లింగ్‌ మూవీస్‌.. అలరించే వెబ్‌సిరీస్‌ లిస్ట్ మీ కోసం..

దృశ్యం 3 (Drishyam 3)
మలయాళ సినీ పరిశ్రమలోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలో భారీ విజయం అందుకున్న థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో 'దృశ్యం' ఒకటి. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు భాగాలతో సంచలన విజయాలు అందుకుంది. ఇప్పుడు మూడో భాగం 'దృశ్యం 3' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. జార్జ్‌కుట్టి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో సస్పెన్స్, ఎమోషన్, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఒక సాధారణ వ్యక్తి చేసే పోరాటమే ఈ ఫ్రాంచైజీ బలం. థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది.

OTT Releases This Week Drishyam 3 Save The Tigers 3 Athiradi amp amp Top New Releases

కెనాథ కానోమ్ (Kenatha Kanom)
తమిళ దర్శకుడు సురేష్ సంగయ్య చివరిసారిగా తెరకెక్కించిన సినిమా 'కెనాథ కానోమ్'. రామనాథపురం జిల్లాలోని కరియపట్టినం గ్రామంలో తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గ్రామస్తులు నీటి సమస్యకు పరిష్కారంగా ఒక పురాతన బావిని కనుగొంటారు. అయితే అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ బావి కనిపించకుండా పోవడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. బావి అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో నీటి కొరత, స్థానిక రాజకీయాలు, అవినీతి, భారీ కుట్రలు వెలుగులోకి వస్తాయి. యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్రామీణ కామెడీ-డ్రామా జూన్ 16 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

సేవ్ ది టైగర్స్ 3(Save The Tigers 3)
తెలుగు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లలో 'సేవ్ ది టైగర్స్' ఒకటి. కుటుంబ జీవితం, భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలను కామెడీగా చూపిస్తూ వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లతో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మూడో సీజన్ మరింత వినూత్నంగా రాబోతోంది. ఈసారి కథలో ఫాంటసీ అంశాన్ని జోడించారు. తమ జీవితాలపై అసంతృప్తిగా ఉన్న ముగ్గురు భర్తలను దేవేంద్రుడు ప్రత్యామ్నాయ ప్రపంచాల్లోకి పంపిస్తాడు. అక్కడ వారు కోరుకున్న జీవితాలు దొరికితే నిజంగా సంతోషంగా ఉంటారా? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో సీజన్ 3 రూపొందింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 19 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

తుక్రా కే మేరా ప్యార్ 2 (Thukra Ke Mera Pyaar season 2)
2024లో సంచలనం సృష్టించిన 'తుక్రా కే మేరా ప్యార్' వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొదటి సీజన్‌లో ప్రేమ, వర్గ వివక్ష, ప్రతీకారం ప్రధానాంశాలుగా ఉండగా, రెండో సీజన్‌లో కథ రాజకీయ రంగు పులుముకుంది. ఒకప్పుడు ప్రేమికులైన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిన పరిస్థితులను ఈ సీజన్ చూపించనుంది. ప్రేమ, ద్వేషం, అధికారం, ప్రతీకారం కలగలిసిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధవల్ ఠాకూర్, సంచితా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 19 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అతిరడి (Athiradi)
థియేటర్లలో ప్రేక్షకులను నవ్వులతో అలరించిన మాలీవుడ్ యాక్షన్-కామెడీ చిత్రం 'అతిరడి'ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 14న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది.ఈ సినిమాలో రియా షిబు, వినీత్ శ్రీనివాసన్, జరీన్ షిహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. జూన్ 19 నుంచి సోనీ లివ్ (SonyLIV)వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.

M4M - మోటివ్ ఫర్ మర్డర్
ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్‌నే 'M4M - Motive For Murder'. ఈ హంతకుడు చేసే హత్యలు సాధారణంగా ఉండవు. ప్రతి క్రైమ్ సీన్‌ను ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్స్‌ను పోలి ఉండేలా డిజైన్ చేస్తూ, బాధితులను భయానక కళాఖండాలుగా మార్చేస్తాడు. దీంతో నగరంలో భయం, ఉత్కంఠ నెలకొంటాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య)పై పడుతుంది. అతనికి సహాయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన భార్య రాధ (జో శర్మ) రంగంలోకి దిగుతుంది. హంతకుడి తదుపరి టార్గెట్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో వీరిద్దరూ పలు షాకింగ్ నిజాలను వెలికితీస్తారు. సస్పెన్స్, క్రైమ్, సైకాలజికల్ థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సిరీస్‌లో సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సీరిస్ జూన్ 19 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో అంతర్జాతీయ కంటెంట్ కూడా ఎంటర్టైన్ చేయడానికి సిద్దంగా ఉంది. స్పానిష్ థ్రిల్లర్ 'ఒయాసిస్', కొరియన్ యాక్షన్ డ్రామా 'హస్బెండ్స్ ఇన్ యాక్షన్', హాలీవుడ్ డాక్యుమెంటరీ 'ఆండ్రే ఈజ్ అన ఇడియట్', 'యోర్ ఫాల్ట్: లండన్', 'ఐ విల్ ఫైడ్ యూ', 'షుగర్ సీజన్ 2', 'వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె' వంటి షోలు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X