OTT This Week: ఓటీటీ వినోదాలు డబుల్.. ఈ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లివే..

OTT This Week: ఓటీటీ ప్రేక్షకులకు మళ్లీ పుల్ టైం ఎంటర్టైమెంట్ అందించడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్దమయ్యాయి. దీంతో జూన్ చివరి వారంలో ఓటీటీ ప్రేక్షకుల్లో పండగ వాతావరణం నెలకొంది. వారం థియేటర్లలో అంత పెద్ద సినిమాలు లేకపోవడంతో సారి చాలా మంది ఓటీటీ వైపు మొగ్గుచూపుతారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్ములు వరుసగా భారీ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. హాలీవుడ్ ఫాంటసీ సిరీస్‌లు, ఇండియన్ వెబ్ సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్లు, రియాలిటీ షోలు, డాక్యుమెంటరీలు, ఫ్యామిలీ డ్రామాలు.. ఇలా ఎన్నో రకాల కంటెంట్ ఈ వారం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. జూన్ 22 నుంచి జూన్ 28 మధ్య స్ట్రీమింగ్ కానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లివే

'హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 3'

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్'. ఈ సిరీస్ లోని మూడో సీజన్ జూన్ 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. టార్గేరియన్ వంశంలో జరిగే అంతర్యుద్ధం, ఐరన్ థ్రోన్ కోసం సాగే పోరాటం ఈ సీజన్‌లో హైలెట్ అంశాలు. అలాగే.. రేనీరా టార్గేరియన్, ఏగాన్ టార్గేరియన్ మధ్య అధికారం కోసం జరిగే 'డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్' యుద్దాలను ఈసారి మరింత భారీ స్థాయిలో చూపించనున్నారట. రాజకీయ కుట్రలు, ద్రోహాలు, రక్తపాత యుద్ధాలు, డ్రాగన్ ఫైట్లు ఈ సీజన్ ప్రత్యేకతలు.

OTT Releases This Week From House of the Dragon Season 3 Avatar Fire and Ash to Blast Full List Here

'అవతార్: ఫైర్ అండ్ యాష్'
దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ సృష్టించిన 'అవతార్' ప్రపంచానికి వర్డల్ వైడ్ గా ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఇప్పుడు జూన్ 24 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. పాండోరా గ్రహంలో కొత్త జాతులు, కొత్త శక్తులు, కొత్త యుద్ధాలు ఈ సినిమాలోని స్పెషల్ అట్రాక్షన్స్. విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మాత్రం అసలు మిస్ కాకండి.

అర్జున్ సర్జా యాక్షన్ మూవీ 'బ్లాస్ట్'
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ యాక్షన్ డ్రామా 'బ్లాస్ట్'. ఈ మూవీ కూడా వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్ (Netflix)లో జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.దర్శకుడు సుభాష్ కే రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్, అభిరామి, అర్జున్ చిదంబరం కీలక పాత్రల్లో నటించారు. మధ్యతరగతి కుటుంబం జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు, తెలియని వ్యక్తులతో జరిగే పోరాటాలు, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుతో సినిమా రూపొందింది.

'లింగం'
తమిళ నటుడు కథిర్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'లింగం'. ఈ వెబ్ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైంది. కబడ్డీ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్న యువకుడు ఊహించని విధంగా ఓ హత్య కేసులో ఇరుక్కొవడం, అతడు నేర ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాల్సి వచ్చిందనేదే సినిమా కథాంశం. ఈ సిరీస్ జూన్ 26 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

'పర్ఫెక్ట్ ఫ్యామిలీ 2'
సోనీలివ్‌లో జూన్ 26 నుంచి 'పర్ఫెక్ట్ ఫ్యామిలీ' రెండో సీజన్ ప్రసారం కానుంది. కుటుంబ సంబంధాలు,తరం తేడాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన సిరీస్ ఇది. తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గుల్షన్ దేవయ్య, మనోజ్ పహ్వా, సీమా పహ్వా, నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X