This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లివే!
This Week OTT Releases: వీకెండ్ దగ్గరపడుతుండగానే థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు సందడి మొదలవుతుంది. థియేటర్లలో అఖండ 2, మౌగ్లీ విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటీటీల్లో మాత్రం ఈ వారం విభిన్న జానర్స్‌లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన 'కాంత' ఓటీటీలో విడుదల కావడం ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.
కాంత (Kaantha)
దక్షిణాది స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మించిన పిరియాడిక్ డ్రామా 'కాంత' ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. తమిళ దిగ్గజాలు ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 12 నుంచి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నది.

సూపర్ హీరో (Superman 2025)
డీసీ యూనివర్స్‌కు చెందిన సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. 1984లో తొలి చిత్రం విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ వరుసగా ప్రేక్షకులను అలరిస్తూ భారీ రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ 'సూపర్ మ్యాన్' ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నా, అది విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ ప్రేక్షకుల కోసం జియో హాట్‌స్టార్ డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చూడొచ్చు.
కలివి వనం (Kalivi Vanam)
ప్రముఖ ఓటిటి వేదిక ఈటీవీ విన్ (ETV Win) స్వయంగా నిర్మించిన చిత్రాలతో పాటు థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తూ విభిన్న కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వారం విడుదల కానున్న ఈసినిమా 'కలివి వనం' (Kalivi Vanam). ఈ మూవీ డిసెంబర్ 11 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ జానపదాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమలో టాలెంటెడ్ నటి నాగదుర్గ హీరోయిన్‌గా నటించగా, రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు.
త్రీ రోజెస్ 2 (3 Roses Season 2)
ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్, ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్ 2 '(3 Roses Season 2). ఎస్ కేఎన్ నిర్మించిన ఈ సిరీస్‌కు డైరెక్టర్ మారుతి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించాడు. ఆహా ఓటీటీలో డిసెంబర్ 13 నుంచి ఈ సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది.
సింగిల్ పాపా (Single Papa)
నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా స్ట్రీమింగ్‌కు వచ్చిన 'సింగిల్ పాపా'(Single Papa) ఎమోషనల్, కామెడీ ఎంటర్టైనర్ వెబ్‌సిరీస్. కునాల్ ఖేము, నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించగా, శశాంక్ ఖైతాన్, నీరజ్ ఉధ్వాన్ దర్శకత్వంలో రూపొందించారు. డిసెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానున్నది.
నెట్‌ఫ్లిక్స్
గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏ నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12
జియో హాట్‌స్టార్
అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్
టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
జీ5
సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12


Click it and Unblock the Notifications











