OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో పండగే.. కరుప్పు నుంచి భూత్ బంగ్లా వరకు భారీ లైనప్!
OTT Releases This Week: ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల పండుగే.. అలా జూన్ రెండో వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందును అందించబోతోంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్ ఇలా అన్ని జానర్లలోనూ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో విజయం అందుకున్న సినిమాలతో పాటు నేరుగా డిజిటల్ ప్రేక్షకుల కోసం రూపొందించిన ఒరిజినల్ కంటెంట్ కూడా ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఓటీటీ సినిమాలేంటీ? ఓ లూక్కేయండి.
కరుప్పు
ఈ వారం ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా సూర్య 'కరుప్పు'. తెలుగులో వీరభద్రుడు గా విడుదలైంది. ఈ సినిమా తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో సూర్య పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ కథనం, సూర్య నటన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

భూత్ బంగ్లా
బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'భూత్ బంగ్లా'. అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఒక వ్యక్తి వారసత్వంగా పొందిన పాత భవంతిలో జరిగే విచిత్ర సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబ వివాహ ఏర్పాట్ల సమయంలో ఆ ఇంటిలో దాగి ఉన్న శాపం బయటపడటంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. భయం, నవ్వులు, మిస్టరీ కలగలిపిన ఈ సినిమాలో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 12 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రాఖ్
క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో 'రాఖ్'అనే కొత్త సిరీస్‌ను తీసుకువస్తోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ కథ మొదట కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసుతో ప్రారంభమవుతుంది. అయితే దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ పిల్లలకు సంబంధించిన భయంకరమైన నేరాల వెనుక ఉన్న కుట్ర వెలుగులోకి వస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠ పెరుగుతూ వెళ్లేలా రూపొందించిన ఈ సిరీస్‌లో సోనాలి బేంద్రే, అలీ ఫజల్, ఆమిర్ బషీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
మా హై నా
ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం జీ5 'మా హై నా' అనే కొత్త రియాలిటీ షోను తీసుకొస్తోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో యువ సెలబ్రిటీలు తమ తల్లులతో కలిసి పాల్గొంటారు. వంటల పోటీలు, సరదా గేమ్స్, భావోద్వేగ సంభాషణలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తల్లి-పిల్లల బంధాన్ని కొత్త కోణంలో చూపించే ఈ షో జూన్ 12 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎవరీ ఇయర్ ఆఫర్
రొమాంటిక్ కథలను ఇష్టపడేవారికి 'ఎవరీ ఇయర్ ఆఫ్టర్'మంచి ఎంపికగా కనిపిస్తోంది. ప్రముఖ నవల 'ఎవరీ సమ్మర్ ఆఫ్టర్'ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఇద్దరు చిన్ననాటి స్నేహితుల ప్రేమకథను చెబుతుంది. కాలక్రమేణా విడిపోయిన వారు మళ్లీ కలిసినప్పుడు గత జ్ఞాపకాలు, చెప్పని భావోద్వేగాలు, జీవితంలోని మలుపులు ఎలా ప్రభావితం చేశాయనేది ఈ కథలో ప్రధాన అంశం. ప్రేమ, అనుబంధాలు, రెండో అవకాశాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ జూన్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
దృఢం
మలయాళ సినీ ప్రేక్షకుల కోసం 'దృఢం' అనే థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ప్రశాంతంగా సాగిపోయే ఒక చిన్న పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో అరుదుగా నేరాలు జరుగుతుంటాయి. అయితే ఒక అనూహ్య సంఘటన మొత్తం ప్రాంతాన్ని కుదిపేస్తుంది. కొత్తగా నియమితుడైన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆ కేసును ఛేదించే ప్రయత్నంలో అనేక రహస్యాలను వెలికితీస్తాడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
మైఖేల్
ప్రపంచ సంగీత దిగ్గజం, "కింగ్ ఆఫ్ పాప్"గా గుర్తింపు పొందిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బయోపిక్ 'మైఖేల్' ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి దాదాపు 850 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,100 కోట్లు) వసూలు చేసింది. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించగా, అతని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ బయోపిక్‌లో మైఖేల్ జీవితంలోని విజయాలు, సవాళ్లు, సంగీత ప్రస్థానాన్ని చూపించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన 'మైఖేల్' సినిమా జూన్ 9 నుంచి బుక్‌మైషో స్ట్రీమ్ వేదికగా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా అందుబాటులో ఉండనుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆపిల్ టీవీలో కూడా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications






