OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో అలరించే బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఇవే..

OTT Releases This Week: సినిమా ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో భారీ సినిమాలు సందడి చేస్తున్న వేళ... ఓటీటీ ప్లాట్‌ఫాంలలోనూ ఈ వారం బ్లాక్ బస్టర్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్-3' డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతుండగా, అదే సమయంలో ఇంట్లోనే కూర్చొని ఓటీటీ వేదికలపై కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. థియేటర్లకు వెళ్లలేని వారు, లేదా కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ఓటీటీ లిస్ట్.. మీరు కూడా ఓ లూక్కేయండి.

రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai)
ఈ వారం ఓటీటీలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది చిన్న సినిమాల హవా. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ రాజ్, తేజస్విని రావ్ జంటగా నటించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈటీవీ విన్ వేదికగా ఎక్స్‌టెండెడ్ కట్‌తో స్ట్రీమింగ్ అవుతుండటంతో, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈటీవీ విన్ లో చూడండి.

OTT Releases This Week Must-Watch Movies and Web Series Streaming Across Platforms

సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)
నవంబర్‌లో థియేటర్లలో సందడి చేసిన మరో సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. క్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి తెరకెక్కించారు. ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు ఒకేసారి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో అయితే ఈ సినిమాకు కొత్త ప్రేక్షకులు దొరికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రేమంటే..(Premante)
ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తున్న సినిమా'ప్రేమంటే'. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నవంబర్ మూడో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఓటీటీలో మాత్రం పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది వంటి నటుల కామెడీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (Dominic and the Ladies Purse )
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ జనవరిలో థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు పది నెలల గ్యాప్ తర్వాత ఈ సినిమా ఇప్పుడు జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు, లేదా మమ్ముట్టి నటనను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓసారి చూడవచ్చు.

నయనం (Nayanam)
తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఈ వారం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వరుణ్ సందేశ్ నటించిన వెబ్ సిరీస్ 'నయనం'. ఇది వరుణ్ సందేశ్‌కు ఓటీటీలో విడుదల కావడం విశేషం. సైకాలజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 19 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, థ్రిల్లర్ లవర్స్‌కు మంచి ట్రీట్‌గా నిలుస్తోంది.

ప్రాంతీయ సినిమాలు, సిరీస్‌లతో పాటు ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో 'రాత్ అఖేలీ హై' వెబ్ సిరీస్, కొరియన్ మూవీ 'ది గ్రేట్ ఫ్లడ్', 'ఎమిలీ ఇన్ పారిస్ - సీజన్ 5', 'బ్రేక్ డౌన్: 1975' డాక్యుమెంటరీ, 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' వంటి కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'థామా', 'ఏక్ దివానే కీ దివానీయత్', 'ఫాలౌట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా... జియో హాట్‌స్టార్ లో 'మిసెస్ దేశ్ పాండే', 'అగ్లీ' వంటి వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. జీ5లో 'దివ్య దృష్టి' సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా ఈ వారం ఓటీటీ లిస్ట్ చూస్తే.. అన్ని రకాల ప్రేక్షకులకు సరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్ అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ వరకు, రొమాంటిక్ కామెడీల నుంచి సైకాలజికల్ వెబ్ సిరీస్‌ల వరకు... ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను అందిస్తున్నాయి. థియేటర్లకు వెళ్లలేని వారు, లేదా కొత్తగా ఏదైనా చూడాలనుకునే వారు... ఈ వారం ఓటీటీని మిస్ అవ్వకూడదని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X