OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. ఈ సినిమాలు డోంట్ మిస్..
OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ప్రియులకు నిజంగానే పండగ అనే చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అయిన తాజా సినిమాలు, విభిన్న జానర్లలో వచ్చిన వెబ్ కంటెంట్ అన్ని కలిసి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వినోదాన్ని రెట్టింపు చేయబోతున్నాయి. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ టైమ్ కావడంతో, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీ సంస్థలు భారీ కంటెంట్‌ను లైన్‌లో పెట్టాయి. యాక్షన్ నుంచి హారర్ వరకు, ఫ్యామిలీ డ్రామా నుంచి సోషల్ థ్రిల్లర్స్ వరకు అన్ని రకాల కంటెంట్ అందుబాటులోకి రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ మధ్యలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
హారర్ ఫాంటసీగా దూసుకొస్తున్న 'రాకాస'
ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న రాకాస ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన ఈ హారర్, ఫాంటసీ, కామెడీ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా, తెలుగు మాత్రమే తమిళం కాదు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఒక బ్రహ్మరాక్షసుడిని అంతం చేసే కథ చుట్టూ తిరిగే ఈ సినిమా... వినోదంతో పాటు థ్రిల్ కూడా అందిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన చిత్రం ఇదే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేస్తున్న 'హ్యాపీ రాజ్'
తమిళ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన హ్యాపీ రాజ్ ఓటీలో సైలెంట్ హిట్‌గా మారింది. G. V. ప్రకాష్ కుమార్ నటించిన ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన వస్తోంది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా, కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. చాలా కాలం తర్వాత నటుడు అబ్బాస్ కనిపించడం కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఇది మంచి ఎంపికగా మారింది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'బైకర్' ఓటీటీలోకి
యంగ్ హీరో శర్వానంద్ నటించిన బైకర్ కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఇది. ఈ సినిమా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది. తండ్రి కలను నెరవేర్చే కొడుకు కథ ఇది. భావోద్వేగం, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా.. థియేటర్లలో మోస్తరు టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో మంచి రీచ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. రేసింగ్ సీన్స్ ఎమోషనల్ డ్రామా, ప్రత్యేకం అనే చెప్పాలి.
లీడర్'
లీడర్ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండ్ శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఆడియన్స్‌ను ఆకర్షిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
'ది కేరళ స్టోరీ 2'
విడుదలకి ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన కేరళ స్టోరీ 2 ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ మే 1 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నది. సోషల్ మా నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా థియేటర్లలోనే చర్చనీయాంశంగా డ్రా మారింది. ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడంతో పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. వివాదాలే ఈ అదనపు పబ్లిసిటీగా మారాయి.
ఓటీటీ మూవీస్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో: హ్యాపీ రాజ్, లీడర్ వంటి సినిమాలతో పాటు 4, కెవిన్, క్యాంపస్ బీట్స్ S6 వంటి వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి.
ZEE5: ది కేరళ స్టోరీ 2, ఆడు 3 (మే 1) ప్రధాన ఆకర్షణ. అలాగే జిరాక్స్, పంజాబ్ లారెన్స్ వంటి సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్: నీ ఫరెవర్, స్ట్రేంజర్ థింగ్స్, అపెక్స్: హంట్ ఆర్ బి హంటెడ్ వంటి సినిమాలు, సిరీస్‌లు. పలు, ఇంగ్లీష్ హిందీ కంటెంట్ కూడా అందుబాటులోకి వస్తోంది.
సోనీ LIV & ఆహా: Undekhi: The Final Battle (మే 1), అలాగే తెలుగు మూవీ లగ్గం టైమ్ రిలీజ్.
జియో హట్ స్టార్: పేట్రియాట్ లెజెండ్స్ Hangout, 24, బ్యాచ్ మేట్స్ వంటి వెబ్ సిరీస్‌లు, ఒరంగుటాన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications