OTT Releases This Week: సంక్రాంతి స్పెషల్.. ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లివే..
OTT Releases This Week: సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలతో సందడి నెలకొంటే, మరోవైపు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ప్రముఖ ఓటీటీ వేదికల్లో అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాల నుంచి కంటెంట్ ఆధారిత లో బడ్జెట్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకు అన్ని జానర్ల వినోదం ఈ వారం డిజిటల్ స్క్రీన్స్‌పై అందుబాటులోకి వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతికి థియేటర్లు కూడా ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి, ప్రభాస్ ' ది రాజాసాబ్' చిరంజీవి ' మన శంకరవరప్రసాద్ గారు', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు',శర్వనంద్ 'నారీ నారీ నడుమ మురారి' వంటి సినిమాలు థియేటర్లలో విడుదలైన .. పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అయితే థియేటర్‌కు వెళ్లలేని వారు, లేదా ఇంట్లోనే కుటుంబంతో కలిసి పండుగను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ వారం స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వచ్చాయి. ఓటీటీ సినిమాల వివరాల్లోకి వెళ్తే..

1.కాలంకావల్ (Kalamkaval)
ఈ వారం ఓటీటీలో మోస్ట్ వెయిట్ సినిమా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కాలంకావల్. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటికే థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. కేరళ- తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో వరుసగా మాయమవుతున్న మహిళల కేసు, దాని వెనుక ఉన్న సీరియల్ కిల్లర్ మిస్టరీని ఛేదించే పోలీసుల కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మమ్ముట్టి సీరియల్ కిల్లర్ పాత్రలో నటించారు. ఈ సినిమా జనవరి 16 నుంచి Sony LIVలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
2. దండోరా (Dhandoraa)
తెలుగులో సోషల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దండోరా. గత నెల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. శివాజీ, నవదీప్, నందు, బింధు మాధవి, రవి కృష్ణ కీలక పాత్రల్లో నటించగా, మురళీకాంత్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే పాటలు, కథా అంశంపై మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. దీనికి తోడు సినిమా విడుదల సమయంలో శివాజీ చేసిన హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసి సినిమాపై ప్రభావం చూపించాయి. ఈ సినిమీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
3. గుర్రం పాపిరెడ్డి (Gurram Paapi Reddy)
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ గుర్రం పాపిరెడ్డి ఓటీటీకి రెడీ అయింది. టైటిల్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంజేఎం మోషన్ పిక్చర్స్, బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్లపై వేణు, అమర్ బురా, జయకాంత్ ఈ సినిమాను నిర్మించారు.ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 సొంతం చేసుకుంది. జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని అధికారిక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. "జర భద్రం... ఇదంతా మోసం. గుర్రం పాపిరెడ్డి వస్తున్నాడు" అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
4. భా భా భా (Bha Bha Ba)
మలయాళ హీరో దిలీప్ నటించిన కామెడీ చిత్రం భా భా బా ఓటీటీకి రెడీ అయింది. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా డిసెంబర్ 18న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ జనవరి 16 నుంచి రాత్రి 12 గంటల నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది.
5. మహాస్నేహ (Mahasneha)
తమిళంలో మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌కు మరో కొత్త సినిమా చేరుతోంది. అదే మహాస్నేహ. అడ్వెంచర్, సస్పెన్స్, భక్తి అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా జనవరి 13 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటి భాగం ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. విమల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దినేష్ కలైసెల్వన్ దర్శకత్వం వహించారు. అడవుల్లో ఉన్న ఓ చిన్న గ్రామం, అక్కడి గ్రామ దేవత విగ్రహాన్ని ఎత్తుకెళ్లే కుట్ర, దాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులు చేసే పోరాటమే కథాంశం. తండ్రి -కూతురు భావోద్వేగాలు, సంప్రదాయం- ఆధునికత మధ్య సంఘర్షణను ఈ సినిమాలో చూపించారు.
ఇలా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు సంక్రాంతి స్పెషల్ ఫుల్ ప్యాకేజ్ లాంటిది. క్రైమ్ థ్రిల్లర్‌లు, కామెడీ ఎంటర్‌టైనర్స్, సోషల్ డ్రామాలు, అన్నీ ఒకేసారి డిజిటల్ స్క్రీన్‌లపై అందుబాటులోకి వచ్చాయి. థియేటర్‌కు వెళ్లలేని వారు, లేదా ఇంట్లోనే కుటుంబంతో కలిసి పండుగను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ వారం ఓటీటీ నిజంగా పండుగే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











