OTT Releases this week: ఓటీటీలో సంక్రాంతి సినిమాల సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్టార్ సినిమాల హడావుడి కాస్త తగ్గింది. కానీ, ఓటీటీ వేదికలు మాత్రం ఫుల్ బిజీగా మారాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు క్రేజీ సినిమాలు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లలో మిస్ అయినవారికీ, మళ్లీ చూడాలనుకునే అభిమానులకూ ఇది పండుగ లాంటి వారం అని చెప్పొచ్చు. ఈ వారం సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటీ.

ప్రభాస్ 'ది రాజా సాబ్'
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

OTT Releases This Week Sankranti Telugu Movies Streaming Dates Platforms amp amp Full List

చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.410 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్‌లోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి జీ 5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇతర ముఖ్య ఓటీటీ రిలీజులు
సైక్ సిద్ధార్థ - నందు హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిబ్రవరి 4 నుంచి Aha లో స్ట్రీమింగ్.
'అన్నగారు వస్తారు' - కార్తి నటించిన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
'పరాశక్తి' - శివకార్తికేయన్ నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్.

ఇలా ఈ వారం థియేటర్లలో పెద్ద స్టార్ సినిమాల సందడి తక్కువగా ఉన్నప్పటికీ, ఓటీటీలో మాత్రం స్టార్ సినిమాలు, హిట్ మూవీల వరుస రిలీజ్‌లు సినీప్రియులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లో కూర్చొని చూసే ఛాన్స్ రావడంతో, డిజిటల్ ప్రేక్షకులకు ఇది నిజంగా బంపర్ వీక్ అని చెప్పొచ్చు.

More from Filmibeat

Read more about: ott movies zee5 netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X