OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

OTT release this week: థియేటర్లలో సినిమాల సందడి ఎంత పెరుగుతుందో.. ఓటీటీలో కూడా అదే స్థాయిలో పోటీ పెరుగుతోంది. ప్రతి వారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్, యాపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సినిమాలు ఏంటో ఓ లూక్కేయండి.

అబ్సెషన్ (Obsession)
థియేటర్లలో సంచలన విజయం సాధించిన హాలీవుడ్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ (Obsession). తన ప్రేమను గెలుచుకోవాలని ప్రయత్నించిన ఓ యువకుడి జీవితంలో అతీంద్రియ శక్తులు ఎలా భయానక పరిణామాలకు దారితీస్తాయన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. హారర్ అభిమానులకు ఇది మంచి ఛాయిస్‌గా మారనుంది. ఈ థ్రిల్లర్ మూవీ జూన్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లో కాకుండా రెంటల్ మోడ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నా కూడా సినిమాను చూడాలంటే అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

OTT Releases This Week Super Subbu Isakapatnam Obsession amp amp Top New Movies and Web Series

'సూపర్ సుబ్బు'
ఈ వారంలో తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్ 'సూపర్ సుబ్బు'. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా వస్తున్న ఈ కామెడీ డ్రామాలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగిగా, సంప్రదాయ గ్రామంలో ఎదురైన ఫన్నీ సంఘటనలతో కథ సాగుతుంది. మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా, మురళీ శర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషించారు. జూలై 2 నుంచి ఈ సిరీస్ తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి రానుంది.

'ఇసకపట్నం'తో క్రైమ్ థ్రిల్లర్
తెలుగు ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌ను తీసుకొస్తోంది. సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇసకపట్నం' జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, అధికారం, కుటుంబ విభేదాలతో కథ సాగుతుంది. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే అధికార పోరు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

'మాలీవుడ్ టైమ్స్'
'ప్రేమలు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ నటించిన 'మాలీవుడ్ టైమ్స్' కూడా జూలై 3నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. సినిమా దర్శకుడిగా ఎదగాలనే కలలతో ఉన్న ఓ యువకుడి ప్రయాణం, హారర్ సినిమా తీయాలనే అతని పట్టుదల, ఇండస్ట్రీలో ఎదురైన కష్టాల నేపథ్యంలో ఈ డార్క్ కామెడీ తెరకెక్కింది.

'గుర్తుకొస్తున్నాయి'
తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈటీవీ విన్‌లో 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ కూడా జూలై 3 నుంచి ప్రసారం కానుంది. విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీలో అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం హారర్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ కథలు ఒకేసారి అందుబాటులోకి వస్తుండటంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏమాత్రం కొరత ఉండదని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X