OTT Releases This Week: ఓటీటీలో సినిమాల జాతర..అందరి కళ్ళు పవన్ మూవీపైనే

OTT Releases This Week: ప్రతి వారం లాగే ఈసారి కూడా ఓటీటీలో సినిమా జాతర మొదలైంది. విభిన్న జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలు కొద్దిరోజుల్లోనే ఓటీలోకి వస్తుండటం, కొన్ని ప్రాజెక్టులు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ప్రతి వారం పదుల సంఖ్యలో కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో కొన్ని ప్రాజెక్టులు భారీ హిట్ అవుతుంటే, మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ వారం కూడా అదే ట్రెండ్ కొనసాగుతూ, వివిధ రకాల కంటెంట్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఓటీటీ ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌లో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

OTT Releases This Week Ustaad Bhagat Singh Leads Massive Streaming Lineup Buzz

అదే సమయంలో డార్క్ కామెడీగా ప్రదర్శించిన 'టోస్టర్' కూడా ఏప్రిల్ 15న విడుదలైంది. ఒక చిన్న విషయంపై మొదలైన కథ ఎలా హాస్యభరితమైన గందరగోళంగా మారుతుందో చూపిస్తే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఇక 'బీఫ్ సీజన్ 2' కూడా ఈ వారం స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఈ సిరీస్‌లో చిన్న సంఘటనలు ఎలా పెద్ద గొడవలకు దారితీస్తాయో చూపించడం ప్రధాన ఆకర్షణ. అలాగే అల్ఫా మేల్స్ (Alpha Males)సీజన్ 5 కూడా ఏప్రిల్ 17న స్ట్రీమింగ్ కానునది. మధ్య వయస్కుల జీవితంలో వచ్చే కామెడీగా చూపించే ఈ సిరీస్ ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 'రూమ్‌మేట్స్' అంటే కామెడీ డ్రామా కూడా అదే రోజు స్ట్రీమింగ్ కానున్నది.

అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నది 'మత్కా కింగ్'. 1960ల ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్ ఒక వ్యాపారి గ్యాంబ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చూపిస్తుంది. క్రైమ్, డ్రామా, రియల్ స్టోరీ ఫీల్ కలగలిపిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక బాల్స్ అప్ (Balls Up)అనే యాక్షన్ కామెడీ కూడా అదే వారం విడుదల అవుతోంది. అలాగే కొరియన్ డ్రామా 'Absolute Value of Romance' యువతకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వారం ప్రైమ్ వీడియోలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఒకే ప్యాకేజ్ అందుబాటులోకి రానుంది.

జీ5
జీ5 ప్లాట్‌ఫామ్ ఈ వారం ప్రాంతీయ కంటెంట్‌పై దృష్టి పెట్టింది. 'డీప్ జ్యోతి' అంటే మరాఠీ ఫ్యామిలీ డ్రామా, అలాగే 'రుబాబ్' అనే రొమాంటిక్ సినిమా స్ట్రీమింగ్‌కు వస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ అంశాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇవి బెస్ట్ ఆప్షన్ గా మారనున్నాయి.

జియోహాట్‌స్టార్
జియోహాట్‌స్టార్‌లో 'యుఫోరియా సీజన్ 3' ఏప్రిల్ 13 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో టీనేజ్ లైఫ్ నుంచి అడల్ట్ లైఫ్‌కు మారే సమయంలో వచ్చే మార్పులను చూపిస్తారు. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ విడుదల కావడం దీని ప్రత్యేకత. అలాగే.. ఏ గొరిల్లా స్టోరీ (A Gorilla Story), రొనాల్డిన్హో- ది వన్ అండ్ ఓన్టీ(Ronaldinho: The One and Only)వంటి సీరిస్ లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.

మొత్తానికి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రీమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి చూపారు. ఇంట్లోనే ఫ్యామిలీతో యాక్షన్, కామెడీ, రొమాన్స్ సినిమాలు చేస్తూ ఎంజాయ్ చెయొచ్చు. మీరు ఏ సినిమా చూస్తారు?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X