OTT Releases This Week: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

OTT Releases This Week: ప్రతివారం లాగే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ సందడి చేయబోతోంది. లవ్ కామెడీలు, ఎమోషనల్ డ్రామాలు, కాంట్రవర్సీ సీక్వెల్స్, హారర్ థ్రిల్లర్స్... ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాలు మంచి బజ్‌ను సృష్టిస్తుండగా, ఓటీటీలో కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఆ సినిమాల లిస్ట్ మీ కోసం..

ఈ వారం థియేటర్లలో
శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం'
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Sri Vishnu) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం (Vishnu Vinyasam). లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా శ్రీ విష్ణు కనిపించనున్నాడు. యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. సత్య, బ్రహ్మాజీ వంటి కామెడీ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ కామెడీగా మేకర్స్ ప్రచారం చేస్తున్నారు.

OTT Releases This Week Vishnu Vinyasam The Kerala Story 2 amp amp More Movies Streaming in Theatres OTT

'ది కేరళ స్టోరీ 2'
వివాదాల నడుమ విడుదలై చర్చనీయాంశమైన సినిమా ది కేరళ స్టోరీ (The Kerala Story). ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ది కేరళ స్టోరీ 2 (The Kerala Story 2) కూడా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా మళ్లీ చర్చలకు దారి తీస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ డిబేట్ మొదలవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫార్మ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

'ది రైజ్ ఆఫ్ అశోక'

అభినయ, చతుర, సతీష్ నీనాసం నటించిన 'ది రైజ్ ఆఫ్ అశోక' ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్‌, సతీష్‌ పిక్చర్స్‌ హౌస్‌ బ్యానర్‌ల మీద వర్ధన్‌ నరహరి, జైష్ణవి, సతీష్‌ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రానుంది. ఎమోషనల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

'సన్ ఆఫ్' - ఫాదర్ సెంటిమెంట్
సాయి సింహాద్రి (Sai Simhadri) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'సన్ ఆఫ్' (Son Of Movie). సాయి సింహాద్రి సైన్మా పతాకం మీద ఆయనే ప్రొడ్యూస్ చేశారు. బత్తుల సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ మూవీ వస్తోంది.

ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు..

'శ్రీ చిదంబరం గారు'
ఇటీవల థియేటర్లలో విడుదలైన ఎమోషనల్ డ్రామా 'శ్రీ చిదంబరం గారు' (Sri Chidambaram Gaaru) ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 19నే ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా డిజిటల్ ప్రీమియర్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త తేదీని ప్లాట్‌ఫామ్ అధికారికంగా ధృవీకరించింది. టైటిల్ రోల్‌లో వంశీ తుమ్మల నటించగా, వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమయ్యారు. సంధ్యా వశిష్ట హీరోయిన్‌గా కనిపించింది. తులసి, కల్పలత, గోపీనాథ్ కీలక పాత్రలు పోషించారు.

హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ది బ్లఫ్'
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న హాలీవుడ్ సినిమా ది బ్లఫ్ (The Bluff) ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ఫ్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆమె సన్నిహిత మిత్రుడు హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ప్రియాంకకు సపోర్ట్ తెలుపుతూ పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రియాంక లాస్ ఏంజెల్స్‌లో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక్కిస్ (Ikkis)
హిందీ మూవీ ఇక్కిస్ (Ikkis)కూడా ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్తా నంద (Agastya Nanda)హీరోగా నటించగా, ఈ సినిమాలో దివంగత లెజెండ్ ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. అలాగే జయ్ దీప్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతేకాదు.. హారర్ థ్రిల్లర్ జానర్ అభిమానులకు ఈ వారం ప్రత్యేకం. 'ఈషా', '56 డేస్' వంటి సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం థియేటర్లలో లవ్, ఎమోషన్, కాంట్రవర్సీ కలిసిన వినోదం సిద్ధంగా ఉండగా, ఓటీటీలో యాక్షన్, థ్రిల్లర్, డ్రామా కంటెంట్ వరదలా రానుంది. సినిమా ప్రేమికులకు ఇది పర్ఫెక్ట్ వీకెండ్. మీరు థియేటర్‌కి వెళ్తారా? లేక ఓటీటీలో బింజ్ వాచ్ చేస్తారా? ఎంపిక మీది!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X