OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు,వెబ్ సిరీస్‌లివే.. వాటిని అస్సలు మిస్ కాకండి.
OTT Releases This Week: ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌కు క్రేజ్ పెరిగిపోతుంది. ఓటీటీ క్రేజ్ పెరిగాక థియోటర్లో సినిమా చూసేవారికి కంటే ఓటీటీలో సినిమాలు,వెబ్ సిరీస్‌లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలైతే థియేటర్‌లో కంటే ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్‌కు వెళ్లి మూవీస్ చూడడం కన్నా.. ఇంట్లో కూర్చుని ఏం చక్కా ఫోన్‌లో తమకు ఇష్టమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు.
ఇటీవల థియేటర్‌లలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం.. ఓటీటీలకు క్రేజ్ పెరగడం ఎక్కువయ్యింది. చాలా వరకు వీకెండ్‌లో సరికొత్త కంటెంట్ ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. పైగా ఇది వర్షాకాలం. కాగా జనాలు ఇంట్లోనే ఉండి సినిమాలు చూడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పాప్‌కార్న్, బజ్జీలు, బిస్కెట్స్ లాంటి స్నాక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇంట్లో ఇద్దరు ముగ్గురు బ్రదర్స్, సిస్టర్స్ కానీ ఉన్నట్లైతే.. ఇంట్లో పండగే.

సినిమా చూడడం కన్నా తమ అల్లరే ఎక్కువగా ఉంటుంది. కొంతమందైతే పేరెంట్స్‌తో కూర్చుని మరీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఓటీటీ ప్రియులు ఈ వారం ఓటీటీల్లోకి ఏంఏం సినిమాలు వస్తాయంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరీ ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆయ్ ..
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంతో సాగే కామెడీ స్టోరీతో వచ్చేసింది ఆయ్. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.
కడుపుబ్బా నవ్వించే కామెడీతో రూపొందిన 'ఆయ్' మూవీకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుంచే ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ చిత్రం కోసం వీక్షకులు ఎగబడుతున్నారు. ఫలితంగా దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

కమిటీ కుర్రోళ్లు
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'కమిటీ కుర్రాళ్ళు'. ఆగస్టు 9న విడుదలైన ఈ మూవీకి సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళను రాబట్టింది. 5 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.17కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నది. థియేటర్స్‌లో ఆకట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ అందరూ కొంతవాళ్లే.
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆయ్ - తెలుగు - సినిమా ( నెట్‌ఫ్లిక్స్)
కమిటీ కుర్రోళ్లు - తెలుగు - సినిమా (ఎట్వివిన్)
Mr.బచ్చన్ - తెలుగు - సినిమా ( నెట్‌ఫ్లిక్స్)
బెంచ్ లైఫ్ - తెలుగు - సిరీస్ ( SonyLIV)
మనీ గేమ్ - ఇంగ్లీష్ - సిరీస్ ( ప్రైమ్ వీడియో)
తలవన్ - మలయాళం - సినిమా ( సోనీలివ్)
రఘు తాత - తమిళం - సినిమా - (జీ5)
విశేషం - మలయాళం - సినిమా ( కేవలం సౌత్)
టెక్నో బాయ్స్ - స్పానిష్ - సినిమా -(నెట్‌ఫ్లిక్స్)
ఎమిలీ ఇన్ పారిస్ S4 పార్ట్ 2 - ఇంగ్లీష్ - సిరీస్ (నెట్‌ఫ్లిక్స్)
ఖల్బలి రికార్డ్స్ - హిందీ - సిరీస్ (జియో సినిమా)
నన్బన్ ఒరువన్ వంత పిరగు - తమిళం - సినిమా ( ఆహా తమిళం)
గోలీ సోడా రైజింగ్ - తమిళం - సిరీస్ (హాట్‌స్టార్)
నునక్కుజి - మలయాళం - సినిమా (Zee5)
బెర్లిన్ - హిందీ - సినిమా (Zee5)
సెక్టార్ 36 - హిందీ - సినిమా (నెట్‌ఫ్లిక్స్)
నిదర్ - పంజాబీ - సినిమా (చౌపాల్)
ఆహా - తెలుగు - సినిమా (ఆహా)
ట్రాప్ - ఇంగ్లీష్ - సిరీస్ (BMS స్ట్రీమ్)
లేట్ నైట్ విత్ ది డెవిల్ - ఇంగ్లీష్ - మూవీ (లయన్స్‌గేట్ ప్లే)
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ - కొరియన్ - సినిమా (నెట్‌ఫ్లిక్స్).


Click it and Unblock the Notifications











