OTT Releases This Week: ఈ వారం ఓటీటీలోకి సందడి చేయనున్న హిట్ మూవీలు ఇవే.. డోంట్ మిస్
OTT Releases This Week: రోజురోజుకు ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం రెండు లేదా మూడో వారాల్లో ఓటీటీకి ప్రత్యేక్షం అవుతుండటంతో ఎక్కువ మంది దీనికే ఓటేస్తున్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చోని చూసేస్తున్నారు. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారంటే.. ఓటీటీ మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా ఆసక్తి చూపడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో ఏ మూవీస్ సందడి చేస్తున్నాయో ఓ లుక్కేద్దాం..
35 - చిన్న కథ కాదు
యంగ్ బ్యూటీ నివేదా థామస్, విశ్వేదేవ్, ప్రియదర్శి, గౌతమి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 35 - చిన్న కథ కాదు. దర్శకుడు నందకిషోర్ ఈమని ఈ మూవీని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో '35-చిన్న కథ కాదు' అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి వివేక్ సాగర్ చక్కటి సంగీతాన్ని అందించాడు.

ది గోట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ది గోట్ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి, శివకార్తికేయన్, త్రిష లీడ్ రోల్స్ లో నటించారు. కొంతకాలంగా స్ట్రీమింగ్ డేట్ పై ఫుల్ బజ్ నడుస్తుండగా..ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ వారం ఓటీటీలోకి సందడి చేయనున్న సినిమాలు ఇవే..
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్)
రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)
ఇట్స్ వాట్ ఇన్‌సైడ్ (ఇంగ్లీష్)
చెఫ్ టేబుల్: నూడుల్స్ S1 (ఇంగ్లీష్)
ది గోట్ (తెలుగు) నెట్‌ఫ్లిక్స్
కంట్రోల్(హిందీ) - నెట్‌ఫ్లిక్స్
ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ మూవీ)
ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్)
జీ5 (Zee5)
ది సిగ్నేచర్ (హిందీ)
ప్రేమ రంగులు (హిందీ)
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
కూకీ ( హిందీ)
హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్)
ది ట్రైబ్ (హిందీ)
ఛాలెంజర్స్ (ఇంగ్లీష్)
క్లౌడ్ మౌంటైన్ (చైనీస్)
మనోరమా మ్యాక్స్ (Manorama Max)
ఆనందపురం డైరీస్ (మలయాళం)
జియో సినిమా (Jio Cinema)
అరణ్మనై 4 (హిందీ )
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ)
ఆహా (Aha)
35 చిన్న కథ కాదు (తెలుగు)
బాలు గాని టాకీస్ ( తెలుగు)
కళింగ (తెలుగు)


Click it and Unblock the Notifications











