OTT Releases This Weekend: వీకెండ్‌లో వినోదాల పండగ..ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
OTT Releases This Weekend: ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో, సినీప్రేక్షకుల దృష్టి మొత్తం ఓటీటీలపై పడింది. సంక్రాంతి సినిమాలే ఇంకా థియేటర్లలో కొనసాగుతున్న ఈ సమయంలో, ఇంట్లో కూర్చొని కొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఓటీటీ వేదికలు అసలైన వినోదాల విందును సిద్ధం చేశాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఎమోషనల్ కథలు, యాక్షన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు... ఇలా అన్ని జానర్లలో కలిపి ఈ వీకెండ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఈ వారం ఓటీటీలో ఏమేమి చూడొచ్చు? ఏ సినిమా, ఏ సిరీస్ ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది? వివరంగా చూద్దాం.
'శంబాల' - మిస్టిక్ థ్రిల్లర్ ఓటీటీలోకి
యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ శంబాల బాక్సాఫీస్ తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025 డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, జనవరి 22 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఆహా గోల్డ్' సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ఒక రోజు ముందే వీక్షించే అవకాశం కల్పించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఛాంపియన్ -పీరియాడికల్ యాక్షన్ డ్రామా
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు, యువ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ మినహా అన్ని దక్షిణాది భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు. అలాగే టీవీ హక్కులను Zee Telugu దక్కించుకోవడంతో, ఓటీటీ తర్వాత బుల్లితెరపై ప్రసారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
'గొల్ల రామవ్వ' - తెలంగాణ సాయుధ పోరాట గాథ
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన ప్రసిద్ధ కథ 'గొల్ల రామవ్వ' ఇప్పుడు విజువల్ మీడియంగా మారింది. దర్శకుడు ముళ్లపూడి వరా* తెరకెక్కించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win)లో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాళ్లూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా తెలంగాణ చరిత్రలోని ఒక కీలక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు పాల్గొని సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చరిత్ర, భావోద్వేగాల మేళవింపుతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
'మారియో' - థియేటర్ తర్వాత ఓటీటీ ఆశలు
2025 డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైన మారియో సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకు డిజిటల్ హక్కులు ఆహా (AHA)ఓటీటీ సొంతం చేసుకోగా, జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ తెరకెక్కించారు. ఈ సినిమాలో
హెబ్బా పటేల్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. థియేటర్లలో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయినా, 'మోగ్లీ' లాంటి సినిమాల మాదిరిగా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
'తేరే ఇష్క్ మే' - నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేమకథ
బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే (Tere Ishq Mein) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ - కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా జనవరి 23 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. రూ.95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో 'అమర కావ్యం'గా రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అన్ని భాషల్లో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.
'చీకటిలో' - క్రైమ్ థ్రిల్లర్
శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో జనవరి 23 నుంచి అమెజాన్ ఫ్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఒక సామాజిక అంశాన్ని థ్రిల్లింగ్ కథనంతో చెప్పే ప్రయత్నం చేసింది. కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, సందేశాత్మకత కారణంగా కొంత గందరగోళానికి గురైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
'మార్క్' - యాక్షన్ డ్రామా
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మార్క్ జనవరి 23 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండేయగా సుదీప్ నటించిన ఈ సినిమా డ్రగ్స్ మాఫియా, కిడ్నాప్ కేసుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
'సంధ్యానామ ఉపాసతే' - కరోనా కాలం కథ
కరోనా నేపథ్యంతో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా సంధ్యానామ ఉపాసతే నేరుగా ఈటీవీ విన్ లో జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్లు, భయాలు, ప్రశ్నలను సున్నితంగా తెరపై చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తోంది. వంశీ, క్రిస్టెన్ రవళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ప్రోమో భాస్కర్ దర్శకత్వం వహించారు.
ఆహా : శంబా, మేరియో
నెట్ ఫ్లిక్స్: జస్ట్ ఏ డాష్- సీజన్ 3, తేరే ఇష్క్ మెయిన్, ది బిగ్ ఫేక్, సీక్రెట్ మాల్ అపార్ట్మెంట్,
ఎలీనర్ ది గ్రేట్, కాస్మిక్ ప్రిన్సెస్ అగూయా, ఫ్రమ్ ది యాషెస్, కిడ్నాప్డ్ , ఎ బిగ్ బోల్డ్ బ్యూటీ ఫుల్,
ఈటీవీ విన్: సంధ్యానామ ఉపాసతే, గొల్ల రామవ్వ
జీ5: సిరాయ్
జియో హాట్ స్టార్: మార్క్
అమెజాన్ ప్రైమ్ వీడియో: చీకటిలో, లిటిల్ ట్రబుల్ గర్ల్స్, విన్సెన్ట్ మస్ట్ డై, మేరీలీ వుయ్ ఆల్ అలోంగ్,
సన్ నెక్స్ట్: శేషిప్పు
ఫైనల్‌గా... ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు నిజంగా పండగే అని చెప్పాలి. థియేటర్లకు వెళ్లే అవకాశం లేని వారు, కొత్త జానర్లను ట్రై చేయాలనుకునేవారు, హారర్ నుంచి ఎమోషనల్ డ్రామా వరకు అన్ని రకాల సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం ఓటీటీ కంటెంట్ పర్ఫెక్ట్ ప్యాకేజీగా మారింది. మరి మీరు ఈ వీకెండ్ ఏ సినిమా చూస్తున్నారు?


Click it and Unblock the Notifications











