OTTలో ఇప్పుడీ మూడు చిత్రాలదే హవా.. ఎన్ని కొత్త సినిమాలచొచ్చిన వీటి క్రేజ్ తగ్గట్లేదుగా!

ఓటీటీ ప్రియులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీ వారం కొత్త సినిమాలు రావడం.. వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే కొత్త కొత్త సినిమాలతో పాటు చాలా మంది చూసిన చిత్రాలను మళ్లీ మళ్ల చూస్తున్నారు. తమకు నచ్చిన చిత్రాలు కావడంతో.. పాతవే అయినా పదే పదే చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అందుకేనేమో గతేడాది విడుదల అయిన సినిమాలో ఓటీటీ ట్రెండింగ్ లో ఉన్నాయి. కొత్త ఏడాది చాలానే సినిమాలు వచ్చినా అవి మాత్రం టాప్ లోకి రాలేకపోతున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎక్స్ వేధికగా ఓటీటీ టాప్ 3 సినిమాలు లిస్టును విడుదల చేసింది. ఇందులో షాకింగ్ గా గతేడాది విడుదల అయిన చిత్రాలే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులుగా రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా చేసిన యానిమల్ చిత్రమే టాప్ 1లో నిలుస్తోంది. తాజాగా మళ్లీ అదే రిపీట్ అయింది. మొదటి స్థానంలో యానిమల్ ఉండగా.. మరి మిగతా స్థానాల్లో ఏయే చిత్రాలు ఉన్నాయంటే..!

OTT TOP 3 Trending Movies List is Here Check Details

టాప్ 1లో ఇప్పటికీ యానిమల్ లే కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన విడుదల అయిన ఈ సినిమా 2024 జనవరి 26వ తేదీన ఓటీటీలోకి వచ్చంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా.. విడుదల అయిన రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ 1లోనే కొనసాగుతోంది.

ఇక టాప్ 2లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన డంకీ సినిమా నిలిచింది. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌ హిరాణీ, గౌరీ ఖాన్‌, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన విడుదల కాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

OTT TOP 3 Trending Movies List is Here Check Details

ఫిబ్రవరి 14వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవతూ.. అప్పుడప్పుడూ టాప్ లోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా టాప్ 2లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన సలార్ సినిమా టాప్ 3లో నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయగా... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా 800 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెల రోజులు కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈచిత్రాన్ని చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇందులో ఏదైనా మిస్ అయితే మీరు ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X