OTT: వర్షాకాలంలో లవర్‌తో ఎంజాయ్ చేస్తూ.. ఓటీటీలో చూసే ఫీల్‌గుడ్ మూవీ ఇవే!

తొలకరి చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. హాయిగా వెచ్చటి దుప్పటి కప్పుకొని కప్పు టీ తాగడం ఎంత బాగుంటుందో కదా. అలాగే కొన్ని స్నాక్స్ తింటూ, మంచి సినిమాను చూస్తే ఆ ఆనందమే వేరు. మరి ఈ నేపథ్యంలోనే తొలకరి చినుకులు కురుస్తున్న వేళ ప్రియురాలితో కలిసి మనసుకు ఉల్లాసాన్ని కలిగించే బెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.

హ్యాపీడేస్
మిల్కీ బ్యూటీ తమన్నాతో పాటు వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన హ్యాపీడేస్ మూవీ తెలుగు సినిమాలలో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాలేజ్ స్టోరీని ఇష్టపడే మూవీ లవర్స్ కి మాత్రమే కాదు ఇందులోని మనసుకు హత్తుకునే సన్నివేశాల కోసం ఏజ్ తో సంబంధం లేకుండా హ్యాపీ డేస్ మూవీని చూడవచ్చు.

OTT s Top 4 Best Telugu Romantic Movies to watch in Rainy and Monsoon Season

మన్మధుడు
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాలి బింద్రే కలిసి నటించిన తెలుగు రొమాంటిక్ మూవీ మన్మధుడు. ఈ మూవీ లో రొమాంటిక్ అంశాలతో పాటు కామెడీ కూడా కావలసినంతగా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, నాగార్జున మధ్య వచ్చే కామెడీ సీన్స్. మన్మధుడు మూవీని డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు. మంచి రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను చూడాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

OTT s Top 4 Best Telugu Romantic Movies to watch in Rainy and Monsoon Season

బొమ్మరిల్లు
తెలుగు చిత్ర పరిశ్రమలో సిద్ధార్థ్ ను రొమాన్స్ కింగ్ గా మార్చిన మూవీ బొమ్మరిల్లు. ఈ మూవీని కేవలం కపుల్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. సిద్ధార్థ్, జెనీలియా కలిసి నటించిన ఈ అందమైన ప్రేమ కథ జియో సినిమాలో అందుబాటులో ఉంది. ఆ హాసినిని, ఆమె అందమైన చిరు నవ్వును మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేం కదా.

OTT s Top 4 Best Telugu Romantic Movies to watch in Rainy and Monsoon Season

ఏ మాయ చేసావే
సమంతను ఓవర్ నైట్ స్టార్ట్ చేసిన మూవీ ఏ మాయ చేసావే. అలాగే తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి సమంత నటించిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ మూవీ టైమ్ లోనే చై, సామ్ లవ్ లో పడ్డారు. తరువాత విడిపోయారు అనుకోండి అది వేరే విషయం. ఇందులో జెస్సీ డ్రెస్సింగ్, ఎక్స్ప్రెషన్స్, పాటలు, రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో, అలాగే జీ5 లో అందుబాటులో ఉంది.

OTT s Top 4 Best Telugu Romantic Movies to watch in Rainy and Monsoon Season

మజిలీ, అర్జున్ రెడ్డి
ఈ సినిమాతో పాటు తెలుగులో ఇలాంటి ఆహ్లాదకరమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, నిన్ను కోరి, మజిలీ, సీతారామం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X