ఆహాలో పక్కా కమర్షియల్

టాలీవుడ్ టాలెస్ట్ హ్యాండ్సమ్ గోపీచంద్ సినిమా వస్తోంది అంటే జనాల్లో ఆసక్తి నెలకొంటుంది. సినిమా బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా, అంతర్లీనంగా మంచి సందేశం అందించే కథలకు గోపీ పెద్ద పీట వేయడమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఇక ఇదే కోవలో వచ్చిన పక్కా కమర్షియల్ కూడా థియేటర్ల నుంచి నేరుగా ఓటీటీలోకి దారితీస్తోంది. ప్రపంచ సినిమాలను తెలుగు వారి లోగిలికి తీసుకువస్తోన్న ఆహా ఓటీటీలో ఆగస్ట్ 5 నుంచి పక్కా కమర్షియల్ స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

ఇక పక్కా కమర్షియల్ కథ విషయానికి వస్తే విరుద్ధ భావాలున్న తండ్రీ తనయులు వృత్తిపరంగా తలపడితే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా. నీతి నిజాయితీనే నమ్ముకున్న సీనియర్ లాయర్ తండ్రి, అవినీతి బాటలో రాణించాలనుకున్న మరో సక్సెస్ ఫుల్ లాయర్ తనయుడు. ఇద్దరూ ఒకే కేస్ ను చేపట్టి, దాన్ని ఏ విధంగా డీల్ చేశారన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కొత్త తరహా కథలతో ఎప్పుటికప్పుడు ఆకట్టుకునే డైరెక్టర్ మారుతి ఈసారి కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరించేందుకు ప్రయత్నించారు.

Pakka commercial to stream on AHA from July 5th.

కానీ, అనుకున్న కథలో లోటుపాట్లు కాస్త ఎక్కువ అయ్యేసరికి ఎక్కడో కథ గాడితప్పినట్లు అనిపిస్తుంది. కానీ, తనదైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో ఆయన కథ చెప్పిన తీరుకు మంచి మార్కులు పడాల్సిందే.
ఇక నటీనటుల విషయానికి వస్తే... థియేటర్లలో రాణించలేకపోయినప్పటికీ గోపీచంద్, సత్యరాజ్, రావు రమేశ్ నట విన్యాసం ఆహాలో చూడాల్సిందే.

ముఖ్యంగా గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్ ల్లోనూ, కామెడీ టైమింగ్ లోనూ అదరగొట్టేశాడు. సీరియల్ నటిగా, లాయర్ గా రాశీ ఖన్నా సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి. తన బబ్లీ యాటిట్యూడ్ తో సినిమాకు కొత్త ఫ్రెష్ నెస్ తీసుకువచ్చింది. ఏమైనా ఈ వీకెండ్ కు మంచి టైమ్ పాస్ పక్కా కమర్షియల్ అనిపిస్తే ఆహాకు కనెక్ట్ అవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X