RRR OTT Release date: అనుకున్న డేట్ కంటే ముందుగానే విడుదల.. ఓటీటీ సందడి ఎప్పుడంటే?
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినటువంటి RRR సినిమా మార్చి నెల 24వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను అందుకుని నిర్మాతలకు పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు కూడా మంచి ప్రాఫిట్స్ ఐతే అందించింది. అయితే ఈ సినిమా ఓటీటీ కి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు సినిమా ఎప్పుడు డిజిటల్ ప్రపంచం లోకి రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

అలాంటి టాక్ వచ్చినప్పటికీ..
పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్టమొదటి మల్టీస్టారర్ మూవీ విడుదలకు ముందు ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే విడుదల అనంతరం ఓ వర్గం ఆడియెన్స్ నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్స్ తగ్గలేదు. ఇక ఎన్టీఆర్ పాత్రను అంతగా హైలెట్ చేయలేదని కూడా అన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించికోలేదు. తన పాత్ర చాలా సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు.

ఈ సినిమా అనంతరం
అయితే ఎప్పుడో ఏడాది క్రితం రావాల్సిన ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడి మొత్తానికి మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

లాభాలు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా 451 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన RRR సినిమా 453కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమా నేటితో థియేటర్లలోకి వచ్చి 40 రోజులయ్యింది. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా వరల్డ్ వైడ్ గా 604కోట్లకు పైగా షేర్ అందుకున్నట్లు టాక్. 1125కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందినట్లు సమాచారం.

ఓటీటీలో ఎప్పుడు?
ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుంది అనే విషయంలో కొన్ని డేట్స్ ఆడియెన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను థియేటర్స్ లో 75 రోజులు పూర్తి చేసుకున్న తరువాతనే సినిమాను ఓటీటీలో విడుదల చేయాలి. ఆ లెక్క ప్రకారమే RRR ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..?
అంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం RRR సినిమా జూన్ 3వ తేదీన ఓటీటీలోకి రావచ్చని అందరూ అనుకున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకోగా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అనుకున్న డేట్ కంటే ముందే మే 20వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ విడుదల చేయాలని మరోసారి చర్చలు స్టార్ట్ చేసినట్లు టాక్.


Click it and Unblock the Notifications











