Panchayat Season 2 review: అందరిలో ఆసక్తి రేకెత్తించిన 'పంచాయత్ 2' ఎలా ఉందంటే?

రిలీజ్ డేట్ : మే 20, 2022
రివ్యూ : పంచాయత్ సీజన్ 2
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
నటులు: జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, చందన్ రాయ్, ఫైసల్ మాలిక్
దర్శకుడు : దీపక్ కుమార్ మిశ్రా
రచయిత : చందన్ కుమార్
నిర్మాణం :TVF ఫిల్మ్స్

'పంచాయత్' అనే వెబ్ సిరీస్ 2020 సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కరోనా లాక్ డౌన్ సమయంలో విడుదలైన ఈ సిరీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సిరీస్ రెండో సీజన్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ వస్తుందా? అని అందరూ విపరీతంగా ఎదురు చూశారు. ఈ క్రమంలో ఈ సిరీస్ రెండవ సీజన్ మే 20 న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది నిర్ణీత సమయానికి రెండు రోజుల ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత 'పంచాయతీ 2' వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మరి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో చందన్ కుమార్ అందించిన కధ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే.

కథ :

కథ :

మొదటి సీజన్ ముగిసిన చోట నుండి సిరీస్ రెండవ సీజన్ ప్రారంభమవుతుంది. ఫూలేరా గ్రామానికి సెక్రటరీగా ఉన్న అభిషేక్ త్రిపాఠి క్యాట్‌కు సిద్ధమవుతూనే సెక్రటరీగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. గ్రామ పెద్ద మంజు దేవి ( నీనా గుప్తా ) కుటుంబంతో అభిషేక్ సంబంధం మరింత బలపడుతుంది. ప్రధాన్(సర్పంచ్) భర్త బ్రిజ్ భూషణ్ దూబే( రఘుబీర్ యాదవ్), డిప్యూటీ ప్రధాన్(సర్పంచ్) ప్రహ్లాద్ పాండే(ఫైసల్ మాలిక్), మరియు ఆఫీస్ అసిస్టెంట్ వికాస్ (చందన్ రాయ్)తో అభిషేక్ జీవితం సాదాసీదాగా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఆ గ్రామ సమస్యలయిన రోడ్డు, సీసీటీవీ, బహిరంగ మలవిసర్జనపై ఒక్కో ఎపిసోడ్ లో చర్చ జరిగింది. మొత్తం సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉండగా ఎమ్మెల్యేతో అభిషేక్ గొడవ పెట్టుకోవడం నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎమ్మెల్యే దెబ్బకు అభిషేక్ ఏమయ్యాడు? అభిషేక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది మిగతా కథ.

సిరీస్ లో ట్విస్టులు

సిరీస్ లో ట్విస్టులు


MBA ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ చేస్తూనే, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ ఉద్యోగం చేస్తున్న అభిషేక్ కథ 'పంచాయతీ' మొదటి సీజన్ కంటే రెండవ సీజన్‌లో కొంచెం రొమాంటిక్‌గా మారింది. కథ సాగుతున్న కొద్దీ అందులో కొత్త పాత్రలు కూడా తెరమీదకు వస్తాయి. రెండో ఎపిసోడ్‌ నుంచే సునీతా రాజ్‌వర్‌ ఎంట్రీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామంలో మళ్లీ ఎన్నికలు జరగాల్సి రానున్న క్రమంలో సృష్టించిన కథ, కధనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక 'పంచాయతీ' సీజన్ 2 వెబ్ సిరీస్ కథ మొదటి సీజన్ మాదిరిగానే ఉంది. సిరీస్ లో కథ కంటే పాత్రల మధ్య సరదా సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గ్రామీణవాతావరణం, అక్కడి ప్రజలు ఎలా ఉంటారు? లాంటి చిన్న విషయంతో సిరీస్ ను రూపొందించారు. కాబట్టి కథే లేనప్పుడు ట్విస్టులు లాంటివి మాత్రం ఊచించలేము.

నటీనటుల విషయానికి వస్తే

నటీనటుల విషయానికి వస్తే


'పంచాయతీ' సీజన్ 2 వెబ్ సిరీస్‌లో, మొదటి రెండు ఎపిసోడ్‌లలో రెండు కొత్త పాత్రలు ప్రవేశించాయి. ప్రధాన్‌జీ కూతురు రింకీగా సాన్విక ముఖంలో తాజాదనం కనిపిస్తోంది. సునీతా రాజ్‌వర్ గ్రామానికి కొత్త ప్రధాన్ కావాలని పరితపించే పాత్రలో కనిపించింది. క్రాంతి దేవిగా సునీతా రాజ్‌వర్‌, ఆమె భర్త భూషణ్‌గా దుర్గేష్‌ కుమార్‌ నటించారు. నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ల కూతురు రింకీ పాత్రలో సాన్విక చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్రను ఎక్కువగా చూడాలనుకున్నా, ఆమె పాత్రను సీజన్ 3 దాచి ఉంచారనిపించింది. ఎమ్మెల్యే చంద్ర కిషోర్ సింగ్ పాత్రలో పంకజ్ ఝా కూడా సరిపోయాడు.

త్రిపాఠిగా పరకాయ ప్రవేశం

త్రిపాఠిగా పరకాయ ప్రవేశం

ఇక అభిషేక్ త్రిపాఠిగా పరకాయ ప్రవేశం చేసిన జితేంద్ర కుమార్‌ పాత్ర కీలకమ్ అయినా ఆయనకు నటించే స్కోప్ అయితే దక్కలేదు. ఎందుకంటే ఈసారి ప్రేక్షకుల దృష్టి ఇతర పాత్రలపై ఎక్కువగా ఉంది. ప్రధాన్‌జీ పాత్రలో రఘుబీర్ యాదవ్ తెరపై కనిపించగానే చిరునవ్వు తెప్పించాడు. నీనా గుప్తా ఎప్పటిలాగే జీవించేసింది. ఈ సీజన్‌లో ప్రహ్లాద్‌గా ఫైసల్ మాలిక్, పంచాయితీ ఆఫీసులో అసిస్టెంట్‌గా పనిచేసే చందన్‌రాయ్‌ల నటన బాగా హైలైట్ అయ్యాయి. కొడుకును పోగొట్టుకున్న ప్రహ్లాద్‌ పాత్రలో ఫైసల్ మాలిక్ అదరకొట్టాడు.

టెక్నికల్ విషయానికి వస్తే

టెక్నికల్ విషయానికి వస్తే


దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన 'పంచాయతీ' రెండో సీజన్ ఓవరాల్ గా ఆకట్టుకుంది. కథ-కథనంలో వేగం లేదనే కానీ ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా సిరీస్ సాగిపోయింది. మొదటి సీజన్ లా రెండో సీజన్ ను మలచాలి అనే ఒత్తిడి చందన్ కుమార్ చేతివ్రాతలో ప్రతిబింబిస్తుంది. ఈ సిరీస్‌లోని సాంకేతిక బృందం కూడా గత సీజన్‌లాగే ఫిట్‌గా ఉంది. ప్రియదర్శిని టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌ని చాలా నీట్‌గా హ్యాండిల్ చేసింది. అమితాబ్ సింగ్ కెమెరా మ్యాజిక్ చేసింది. ఏదో షూట్ చేస్తున్నట్టు కాకుండా, రియలిస్టిక్ టచ్ కనిపించింది. మ్యూజిక్ అందించిన అనురాగ్ సైకియా సినిమాల తరహాలోనే మ్యూజిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. అందుకే అనురాగ్ సైకియా సంగీతాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఆయన సంగీతం లేకుండా 'పంచాయత్' అసంపూర్ణం. ఎడిటింగ్ టేబుల్‌పై అమిత కులకర్ణి చాలా కష్టపడ్డారు. అందుకే సిరీస్‌లో చాలా తక్కువ అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి.

ఫైనల్ గా:

ఫైనల్ గా:

సిరీస్ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే మొత్తంగా 'పంచాయత్ 2' వన్ టైం వాచబుల్. అసభ్యతకు, అశ్లీలతకు తావు లేకుండా ఒక మంచి పల్లెటూరి కథను చెప్పాలనుకున్న టీమ్ ప్రయత్నాన్ని అభినందించాలి. అమాయమకమైన గ్రామస్తులు, వాళ్లకు వచ్చిన కష్టాలు, వాటిని ఎలా ఎదురుకొన్నారు అనేది ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X