OTTలోకి మోస్ట్ పాపులర్ విలేజ్ కామెడీ సిరీస్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

ఓటీటీలోకి మోస్ట్ పాపులర్ విలేజ్ కామెడీ సిరీస్ రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్పెషల్ గా వచ్చే పంచాయత్ సిరీస్ కు కోట్లాది ఫ్యాన్స్ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం... చాలా మంధి ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పటికే పంచాయత్ సిరీస్ నుంచి రెండు సీజన్లు రాగా... ఇప్పుడు మరో సీజన్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో పంచాయత్ సీజన్ 3 రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే...

మోస్ట్ పాపులర్ విలేజ్ కామెడీ పంచాయత్ సిరీస్ కు ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రామా ఇప్పటికే సీజన్ 1, సీజన్ 2 కంప్లీట్ చేసుకోగా.. సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో స్పెషల్ గా వచ్చే పంచాయత్ సీజన్ 3 కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 15 నుంచి పంచాయత్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.

Panchayat Season 3 Going To Streaming on Amazon Prime Video OTT From Jan 15th Full Details Here

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మొదటి పంచాయత్ రెండు సీజన్లను ఉచితంగా చూసేయొచ్చు. మూడో సీజన్ ప్రకటించిన నేపథ్యంలో రెండు సీజన్లను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి రెండు సీజన్లు చక్కని వినోదంతో కూడిన ఎంటర్ టైన్మెంట్ ఉండటంతో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఆ రెండు సీజన్లకు మంచి ఆదరణ వచ్చింది.

పంచాయత్ సీజన్ 3.. డిసెంబర్ 9వ తేదీన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అభిషేక్ త్రిపాఠి పేరుతో జితేంద్ర కుమార్ తన బైక్‌ పై ఉన్నట్టు ఆ లుక్ విడుదల చేశారు. పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 విజయవంతం కావడంతో సీజ‌న్ 3పై కూడా భారీ అంచనాలు నెల‌కొన్నాయి. అభిషేక్ త్రిపాఠి అనే ఇంజినీరింగ్ చ‌దువుకున్న యువ‌కుడికి క్యాంప‌స్ ప్లేస్‌ మెంట్స్‌ లో ఉద్యోగం రాక పోటీ పరీక్షలు రాస్తుంటాడు. ఇక ఆ క్రమంలోనే పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ఉద్యోగం చేస్తుంటాడు.

Panchayat Season 3 Going To Streaming on Amazon Prime Video OTT From Jan 15th Full Details Here

ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని ఫులేరా అనే గ్రామంలో అడుగుపెట్టిన అభిషేక్‌ కు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన గ్రామ‌స్తుల మ‌ధ్య ఇమ‌డ‌లేక అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో తెరక్కించాడు ద‌ర్శ‌కుడు దీప‌క్ కుమార్ మిశ్రా. ఇక ఈ సీజన్ల కామెడీని పండించిన తీరు అందరినీ అలరించింది. ఇక అందుకే ఇండియాలోనే అత్య‌ధిక మంది వీక్షించిన వెబ్‌ సిరీస్‌ ల‌లో ఒక‌టిగా పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 నిలిచింది.

సీజ‌న్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు దీప‌క్ కుమార్ మిశ్రా ఇదివరకే వెల్లడించారు. అందులో భాగంగా ఈ సిరీస్ మూడో సీజన్ 15 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. పంచాయ‌త్ వెబ్ సిరీస్‌ లో అభిషేక్ త్రిపాఠితో పాటు నీనా గుప్తా, ర‌ఘుబీర్ యాద‌వ్‌, ఫైస‌ల్ మాలిక్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మీరు పంచాయత్ సీజన్ మిస్ అయితే.. ఫ్రీగా రెండు సీజన్లు చూసి.. జనవరి 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X