Panchayat Season 4: ముందుగానే ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 4.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఇదే సమయంలో పలు వెబ్ సిరీస్‌లు, కామెడీ డ్రామాలు, సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మెన్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్‌లు సీజన్ల వారీగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. ఈ కోవలోకే వస్తుంది పంచాయత్. 2020లో తొలి సీజన్ రాగా.. సెకండ్ సీజన్ 2022లో, 2024లో మూడో సీజన్ రిలీజై మంచి విజయం సాధించాయి. తాజాగా పంచాయత్ సీజన్ 4 కూడా రెడీ అయ్యింది. దీనిపై మేకర్స్ శుభవార్త చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
విలేజ్ సెక్రటరీగా బీటెక్ యువకుడు
జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, చందన్ రాయ్, ఫైసల్ మాలిక్‌లు కీలకపాత్రల్లో దీపక్ కుమార్ మిశ్రా ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ది వైరల్ ఫీవర్ బ్యానర్‌పై సమీర్ సక్సేనా నిర్మాణం వహించారు. చందన్ కుమార్ రచనా సహకారం అందించగా.. అనురాగ్ సైకియా స్వరాలు సమకూర్చారు. సిటీలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి ఉత్తరప్రదేశ్‌లోని పూలేరా అనే ఓ గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధుల్లో చేరుతాడు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పంచాయత్
విధి నిర్వహణలో అతను ఎదుర్కోన్న అనుభవాలు, గ్రామస్తుల మనస్తత్వాలు, గ్రామీణ నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగులో పంచాయత్‌ను సివరపల్లి పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా మంచి ఆదరణ దక్కింది. తొలి మూడు సీజన్లకు మంచి ఆదరణ దక్కడంతో ప్రేక్షకులు పంచాయత్ నాలుగో సీజన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి తెరదించుతూ ఈ ఏడాది జూన్ 2న పంచాయత్ సీజన్ 4 స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ కొత్త తేదీని విడుదల చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది.
ఈసారి ఎన్నికల హోరు
దీనిని ఒకసారి పరిశీలిస్తే.. ఈసారి ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో పంచాయత్ సీజన్ 4 ఉండే అవకాశం ఉంది. సహజంగానే గ్రామాల్లో పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటాయి. గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సీరియస్ వాతావరణానికి, కామెడీని జోడించి ఈసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు మేకర్స్. ప్రధాన్ జీ, భూషణ్ వర్గాల మధ్య ఎన్నికల రణరంగాన్ని ట్రైలర్‌లో చూపించారు. కామెడీగా ఎన్నికల ప్రచారం, ఇరువర్గాల వ్యూహాలు, ట్విస్టులపై ట్రైలర్‌లో హిట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ .. సీజన్ 4పై ఆసక్తిని పెంచింది.
వారం ముందుగానే స్ట్రీమింగ్
ఎలక్షన్ సీజన్ వచ్చేసింది.. యుద్ధం ప్రారంభమవుతోంది అంటూ పంచ్ డైలాగ్స్‌తో పాటే కామెడీ కూడా ఓ రేంజ్‌లో ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఇప్పటకే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్ తాజా ట్రైలర్‌లో మరింత ముందుకు జరిపి థ్రిల్ చేశారు. పంచాయత్ సీజన్ 4.. జూన్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. షెడ్యూల్ కంటే వారం ముందే పంచాయత్ సీజన్ 4 ఓటీటీలో విడుదల కానుండటంతో ప్రేక్షకులు కూడా ఈ ఎన్నికల హడావుడిని చూడాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి పంచాయత్ సీజన్ 4 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











