Adikeshava OTT: నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదికేశవ.. ఎప్పుడు, ఎలా చూడాలంటే?
మెగా మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడీ కుర్రహీరో. ముఖ్యంగా తొలి సినిమాతోనే వంద కోట్ల హీరోగా పేరు తెచ్చుకుని వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకుంటూ అద్భతమైన కథలతో అలరిస్తున్నాడు. కథలు బాగానే ఉంటున్న ఆశించిన స్థాయిలో ఆడక నిరాశను మిగిల్చాయి. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలని ఆదికేశ సినిమాతో వచ్చాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలల కథానాయిగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆదికేశవ సినిమా నవంబర్ 24వ తేదీన గ్రాండ్ గా విడుదల అయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు కాగా.. థియేటర్ల వద్ద మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తింది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా రెప్సాన్స్ రాలేదు. ఇలా మూడో సారి కూడా వైష్ణవ్ తేజ్ కు గట్టి దెబ్బ పడింది.

అయితే ఈ సినిమా రావడం, పోవడం ఈ పాటికే జరగడంతో... ఈ సినిమాను ఓటీటీ వేధికగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా హిట్టుగా నిలిస్తే 45 రోజుల తర్వాత ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఇది అంతగా ఆడకపోవడంతో.. నెల రోజుకు కూడా కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారట. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే సమయంలో ప్రభాస్ సలార్ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుండగా... ఆదికేశవ చిత్రం ఓటీటీలో అలరించనుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఆదికేశవ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుందట. ఇంత త్వరగా ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. నెలరోజులు కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ చిత్రనాని ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మించారు. వైష్ణవ్ తేజ్, శ్రీలీలలతో పాటు రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ తదితరులు కీలక పాత్రలను చేశారు.


Click it and Unblock the Notifications











