Mirzapur 3 Trailer Review: హింసే నా లక్ష్యం: గుడ్డూ, పూర్వాంచల్‌‌ నా హస్తగతం కాళీన్ భయ్యా..

బాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకొని రెండు సీజన్లు పూర్తి చేసుకొన్న ఈ వెబ్ సిరీస్ జూలై 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ వేగం పెంచిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగ్గల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ షర్మ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. విజయ్ నారాయణ్ వర్మ, అవినాష్ సింగ్ తోమార్, అపూర్వ ధార్ రచనా సహకారం అందించారు.

Pankaj Tripathi Ali Fazal Rasika Dugal s Mirzapur Season 3 trailer out Here complete review

మీర్జాపూర్‌ 3 ట్రైలర్‌లో ఆరంభంలోనే మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తో కేక పెట్టించారు. రెండు సీజన్లకు ఏ మాత్రం తగ్గదనే అభిప్రాయాన్ని, ఫీలింగ్‌ను ట్రైలర్‌తో కలిగించాడు. గుడ్డు పండిట్ ఏకంగా కాలిన్ భయ్యా విగ్రహాన్ని పగలగొట్టి అతడిపై ఉన్న ఆక్రోషాన్ని వెళ్లగక్కడం హైగా నిలిచింది. ఇక గుడ్డూ పండిట్‌దే పూర్వాంచల్ రాజ్యం అంటూ సవాల్ విసిరారు.

అయితే గుడ్డూ మితిమీరిన చర్యలకు అడ్డు కత్తెర వేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు హింసకు తావు లేదు. మన సామ్రాజ్య విస్తరణే ముఖ్యమని గజగామిని అలియాస్ గోలు గుప్తా చెబితే.. వాయలెన్స్ నా యూఎస్పీ అంటూ గుడ్డూ పండిట్ తన కార్యాచరణను బయటపెట్టాడు. అయితే ప్రత్యర్థుల విసిరిన వలలో గుడ్డూ పడి అరెస్ట్ కావడం ట్విస్టుగా కనిపించింది.

గుడ్డు పండిట్‌ను ఎదిరించే వాడు లేడనే మెసేజ్ పుర్వాంచల్ మొత్తానికి వెళ్లాలి అంటూ బీనా త్రిపాఠి చెప్పడమే కాకుండా ఓ యువకుడితో శృంగారం చేయడం ఈ సిరీస్‌లో రొమాన్ప్ పూర్తి స్థాయిలో ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఇక చివర్లో కాలీన్ భయ్యా.. అఖండానంద్ త్రిపాఠి ఎంట్రీ ఇచ్చి.. ఈ మాఫియా సామ్రాజ్యాన్ని నేను, నా తండ్రి సృష్టించాం. ఎన్ని త్యాగాలకు సిద్దమైనా సరే.. మళ్లీ చేజిక్కించుకొంటాం అని చెప్పడం ట్రైలర్‌ను ఓ రేంజ్ ప్రొజెక్ట్ చేసింది. దాంతో మీర్జాపూర్ 3 సీరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X