మీర్జాపూర్ నుంచి బోనస్ సర్‌ప్రైజ్.. బూతు సిరీస్‌లో ఊహించని విధంగా!

గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకులకు వినోదం మరింత చేరువ అయిపోయింది. దీనికి కారణం ఓటీటీలు అందుబాటులోకి రావడమే అని తెలిసిందే. కొత్త కొత్త సినిమాలతో పాటు వాటి నుంచి ప్రత్యేకంగా వస్తున్న వెబ్ సిరీస్‌ల వల్ల ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ బాగా లభిస్తోంది. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ సిరీస్‌లు ఎన్నో వస్తున్నాయి. అలాంటి వాటిలో 'మీర్జాపూర్' ఒకటి.

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకున్న వెబ్ సిరీసే 'మీర్జాపూర్'. బోల్డ్ కంటెంట్‌తో పాటు బూతు డైలాగులు, ఘాటు సన్నివేశాలతో రూపొందిన ఇది.. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. తద్వారా అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో దీనికి కొనసాగింపుగా రెండో దాన్ని కూడా తీసుకు వచ్చారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

Pankaj Tripathi Mirzapur Season 3 Bonus Episode Streaming Started on Amazon Prime

మొదటి రెండు సీజన్‌లు అదిరిపోయే ఆదరణను అందుకోవడంతో 'మీర్జాపూర్' నుంచి మూడో సీజన్‌ను కూడా రూపొందించారు. గతంలో వచ్చిన వాటి కంటే క్రేజీగా దీన్ని రెడీ చేశారు. ఇలా ఎన్నో అంచనాలను పెంచేసి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఈ సీజన్‌కు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చినట్లు చెప్పొచ్చు.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన 'మీర్జాపూర్' మూడో సీజన్‌‌ సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు దీని నుంచి బోనస్ ఎపిసోడ్‌ను కూడా తీసుకు వచ్చారు. నేటి (ఆగస్టు 30) మధ్యాహ్నం నుంచే ఈ కొత్త ఎపిసోడ్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రసారం చేస్తోంది. దీంతో ఇది కూడా మంచి ఆదరణను అందుకుంటోంది. ఫలితంగా 'మీర్జాపూర్' బోనస్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారిపోయింది.

ఇదిలా ఉండగా.. ఓటీటీ చరిత్రలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, పునీత్ కృష్ణ తెరకెక్కించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసిక దగల్, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. దీనికి ఆనంద్ భాస్కర్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X