ఓటీటీలోకి వచ్చేస్తున్న మీర్జాపూర్ కొత్త సీజన్.. ఈసారి మరింత మసాలాతో!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా.. ఈ మధ్య కాలంలో ఓటీటీల వాడకం భారీ స్థాయిలో పెరిగిపోయింది. వీటిలో వచ్చే కంటెంట్‌ను అన్ని వర్గాల వాళ్లు ఇష్టపడుతున్నారు. దీంతో ఈ సంస్థలు అన్నీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ డిఫరెంట్ వెబ్ సిరీస్‌లను తీసుకు వస్తోంది. ఇలా వచ్చిందే 'మీర్జాపూర్' Mirzapur.
ఓటీటీలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ సంచలనం అయిన వెబ్ సిరీసే 'మీర్జాపూర్'. బోల్డ్ కంటెంట్‌తో పాటు బూతు డైలాగులు, సన్నివేశాల్లో హద్దులను దాటేసిన ఇది.. సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను సైతం సొంతం చేసుకుంది. అదే సమయంలో భారీ వ్యూవర్‌షిప్‌తో ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది.

ఓటీటీలో బోల్డు కంటెంట్‌తో వచ్చి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ మొదటి సీజన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వెంటనే రెండో దాన్ని కూడా తీసుకు వచ్చారు. దీనికి సైతం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ సైతం సూపర్ సక్సెస్ అయిపోయిన విషయం తెలిసిందే.
సెన్సేషనల్ కంటెంట్‌తో వచ్చిన 'మీర్జాపూర్' రెండు సీజన్లు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మూడో సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇలా టాకీ పార్టు మొత్తాన్ని ఇప్పటికే కంప్లీట్ చేశారు.

ఎన్నో అంచనాల నడుమ రూపొందుతోన్న 'మీర్జాపూర్' మూడో సీజన్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సంచలన వెబ్ సిరీస్ మూడో సీజన్‌ను జూలై 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, పునీత్ కృష్ణ తెరకెక్కించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసిక దగల్, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. దీనికి ఆనంద్ భాస్కర్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











