ఓటీటీలోకి వచ్చేసిన బూతు సిరీస్.. ఈసారి మరింత వైలెంట్‌గా.. ఎందులో చూడాలంటే!

గతంలో కంటే ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచిలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. అందుకే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా డిఫరెంట్ కాన్సెప్టులతో రూపొందుతోన్నాయి. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అడల్ట్ లేదా వైలెంట్ కంటెంట్ సిరీస్‌లు ఎక్కువగా వచ్చాయి. అలాంటి వాటిలో 'మీర్జాపూర్' Mirzapur సిరీస్ ఒకటి.

ఓటీటీ చరిత్రలోనే అత్యధిక ఆదరణను అందుకుని సంచలనం అయిన వెబ్ సిరీసే 'మీర్జాపూర్'. క్రేజీ కంటెంట్‌తో పాటు బూతు డైలాగులు, ఘాటు సన్నివేశాలతో దాటేసిన ఇది.. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. తద్వారా భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను సైతం సొంతం చేసుకుంది. అదే సమయంలో అత్యధిక వ్యూవర్‌షిప్‌తో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసింది.

Pankaj Tripathi Mirzapur Season 3 Web Series Streaming Started on Amazon Prime

బోల్డు కంటెంట్‌తో వచ్చి దేశ వ్యాప్తంగా ఓటీటీలో సంచలనం అయిపోయిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ మొదటి సీజన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వెంటనే రెండో దాన్ని కూడా తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సైతం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఇప్పుడు 'మీర్జాపూర్' నుంచి మూడో సీజన్‌ను కూడా రూపొందించేశారు.

ప్రేక్షకులు కోరుకునే కంటెంట్‌తో రూపొందిన 'మీర్జాపూర్' మూడో సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని మరింత క్రేజీగా రూపొందించారు. ఇలా ఎన్నో అంచనాలను పెంచేసి తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. గత అర్ధరాత్రి నుంచే ఈ అదిరిపోయే సిరీస్ అందులో అందుబాటులోకి వచ్చేసింది.

Pankaj Tripathi Mirzapur Season 3 Web Series Streaming Started on Amazon Prime

ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన 'మీర్జాపూర్' మూడో సీజన్‌‌లో గతంలో కంటే ఎక్కువ మసాలాను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి అర్ధరాత్రి నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ప్రేక్షకులు అందరూ ఈ సిరీస్‌ను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో 'మీర్జాపూర్' మూడో సీజన్ ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ఓటీటీలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, పునీత్ కృష్ణ తెరకెక్కించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసిక దగల్, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. దీనికి ఆనంద్ భాస్కర్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X