Parampara 2 డిస్నీ హాట్‌స్టార్‌లో మోత.. రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌గా
పరంపర వెబ్ సిరీస్ తొలి సీజన్ విశేష ఆదరణ సంపాదించుకొన్నది. బాహుబలి ఫేమ్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ గ్రాండియర్‌గా ఉండటంతో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందారు. పరంపర సీజన్ 1 అందించిన జోష్ కారణంగా పరంపర 2పై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల ఎదురు చూపుల మధ్య పరంపర 2 జూలై 21వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఎల్ కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వం, జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటన, కథ ఎమోషనల్‌గా డ్రైవ్ చేయడంతో పరంపర 2 కు విశేష ఆదరణ దక్కుతున్నది.
పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పరంపర 2 వెబ్ సిరీస్ రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. గత వారం రోజుల్లో ఈ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ యాప్‌లో 250 మిలియన్ మినిట్స్ వ్యూస్‌ను సాధించడం రికార్డ్‌గా పేర్కొంటున్నారు. మూడు జెనరేషన్స్‌కు సంబంధించిన కథతో రూపొందిన పరంపర 2 మొదటి సీజన్ సక్సెస్‌ను మరో లెవెల్‌కు తీసుకెల్లింది. పరంపర 2వ సీజన్‌లోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. మాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ను కలిగిస్తున్నాయి.

నటీనటులు: నవీన్ చంద్ర, శరత్ కుమార్, జగపతి బాబు, ఆకాంక్ష సింగ్, నైనా గంగూలీ, ఆమని, కస్తూరి, దివి తదితరులు
కథ : హరి ఏలేటి
మాటలు: కృష్ణ విజయ్ ఎల్, హరి ఏలేటి
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
ఓటీటీ రిలీజ్: 2022-07-21


Click it and Unblock the Notifications











