OTTలో అదరగొడుతోన్న 'బలగం' వంటి తమిళ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసులు, డిఫరెంట్ జోనర్ల సినిమాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు మేకర్స్. ఎప్పటికప్పుడు కొత్త ఓటీటీలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. అయితే సాధారణంగా థియేటర్లలో, నేరుగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. లేదా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయి. అలా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సత్తా చాటుతోంది. మరి అదేంటనే వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువైపోయాయి. అందుకే మూవీ లవర్స్ భాషాబేధం లేకుండా సినిమాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక కాన్సెప్ట్ బాగుంటే ఏ భాష అయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఆనందిస్తున్నారు సినీ ప్రియులు. ఇక ప్రేక్షకుల అభిరుచి తెలుసుకున్న దర్శకనిర్మాతలు సైతం తమ సినిమాలను వివిధ భాషల్లో డబ్ చేస్తూ ఓటీటీలోకి వదులుతున్నారు. అలా తాజాగా వచ్చిన తెలుగు డబ్బింగ్ తమిళ సినిమానే తండాట్టి (Thandatti Movie).

Pasupathi Ramaswamy Thandatti

ఈ మధ్య పల్లెటూరు కట్టుబాట్లు, సాంప్రదాయాలు వంటి కాన్సెప్టుతో వచ్చిన సినిమాలు విపరీతంగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇటీవల బలగం సినిమాకు ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సేమ్ బలగం వంటి కాన్సెప్టుతో వచ్చిన తమిళ సినిమా తండాట్టి ది స్టోరి ఆఫ్ గోల్డ్ అనేది ట్యాగ్ లైన్. రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన తండాట్టి సినిమాలో పశుపతి రామస్వామి (Pasupathi Ramaswamy), రోహిణి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు.

జూన్ 23న తమిళనాడు థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది తండాట్టి సినిమా. అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన ఈ సినిమాకు కలెక్షన్స్ సైతం భారీగానే వచ్చినట్లు సమాచారం. అలాంటి తండాట్టి సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో జూలై 14 నుంచి అందుబాటులో ఉన్న తండాట్టి సినిమాకు (Thandatti OTT) డిజిటల్ ప్రేక్షకులు సైతం ఆదరిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అచ్చం బలగం మూవీని తలపిస్తోందని విపరీతంగా చూసేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X