Patriot on OTT: పేట్రియాట్ ఓటీటీ డేట్ ఫిక్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళ నట దిగ్గజాలు మోహన్‌లాల్, మమ్ముట్టిలు దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మూవీ పేట్రియాట్. రిలీజ్‌కు ముందే ఎన్నో అంచనాలు, రికార్డులతో హైప్ అందుకున్న ఈ యాక్షన్ డ్రామా.. విడుదల తర్వాత చతికిలపడింది. రెండు మూడు రోజులు తప్పించి.. థియేట్రికల్‌ రన్‌లో ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయింది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల క్రేజ్ సైతం పేట్రియాట్‌ను కాపాడలేకపోయింది. చివరికి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పేట్రియాట్ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనేది పరిశీలిస్తే..

Also Read
'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’
'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’

పేట్రియాట్‌ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దేశభక్తి, యాక్షన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది.

Patriot OTT Release Mohanlal-Mammootty film Heads to Digital Streaming After Box Office Disaster

పేట్రియాట్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పేట్రియాట్ మూవీకి 140 కోట్ల బడ్జెట్ అయినట్లు మలయాళ సినీ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో చిత్రీకరణకు తోడు నిర్మాణ విలువల కోసం నిర్మాతల ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టారు. దాంతో పేట్రియాట్ మూవీ లాభాల్లోకి రావాలంటే 140 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Recommended For You
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?

పేట్రియాట్ కలెక్షన్స్
పేట్రియాట్‌కు ఇండియాలో తొలిరోజున 11.60 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.13 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.38 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.97 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.74 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.47 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.14 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 82 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు, పదో రోజున 1.24 కోట్ల రూపాయలు, పదకొండవ రోజున 55 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 55 లక్షల రూపాయలు, పదమూడో రోజున 35 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 13 లక్షల రూపాయలు, పదిహేనవ రోజున 8 లక్షల రూపాయలు, పదహారో రోజున 9 లక్షల రూపాయలు, పదిహేడో రోజున 10 లక్షల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 3 లక్షల రూపాయలు, పందోమ్మిదవ రోజున 3 లక్షల రూపాయలు, ఇరవయ్యోవ రోజున 3 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 32 కోట్ల రూపాయల నెట్... 37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది పేట్రియాట్.

You May Also Like
పెద్ది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌కి చీఫ్ గెస్ట్‌గా నందమూరి హీరో? బుచ్చిబాబు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్!
పెద్ది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌కి చీఫ్ గెస్ట్‌గా నందమూరి హీరో? బుచ్చిబాబు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్!

ఇండియాలో ఫెయిలైనా ఓవర్సీస్‌లో మాత్రం పేట్రియాట్‌కు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు కాస్తయినా పరువు నిలబడింది అంటే ఈ కలెక్షన్స్ వల్లే. నార్త్ అమెరికా, గల్ఫ్ రీజియన్‌లు మోహన్‌లాల్- మమ్ముట్టికి అండగా నిలిచాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఓవర్సీస్‌లో దాదాపు 44 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి పేట్రియాట్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 81 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. మోహన్‌లాల్- మమ్ముట్టి ఉండి కూడా కనీసం 100 కోట్ల రూపాయల మార్క్ చేరుకోకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Patriot Closing Collections: చేతులెత్తేసిన మోహన్‌లాల్-మమ్ముట్టి.. పేట్రియాట్‌ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
Patriot Closing Collections: చేతులెత్తేసిన మోహన్‌లాల్-మమ్ముట్టి.. పేట్రియాట్‌ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

పేట్రియాట్ ఏ ఓటీటీలో?
పేట్రియాట్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ దాదాపు 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. థియేటర్‌లలో విడుదలైన 4 నుంచి 5 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. దాంతో మే చివరి వారంలో లేదంటే జూన్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. అయితే పేట్రియాట్ ఓటీటీ రిలీజ్‌పై జీ5 అధికారిక ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం జూన్ 5న ఈ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లలో డిజాస్టర్‌గా నిలిచిన పేట్రియాట్.. ఓటీటీలో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more about: Patriot mohanlal mammootty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X