Malli Pelli on OTT ఓటీటీలో మళ్లీ పెళ్లి.. పవిత్రా లోకేష్, నరేష్ అక్కడైనా ఆకట్టుకొంటారా?
నవరస రాయ డాక్టర్ వీకే నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్రం రిలీజ్‌కు ముందు భారీ ప్రచారాన్ని అందుకొన్నది. నరేష్, పవిత్రా లోకేష్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కించారు. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను వీకే నరేష్ నిర్మించారు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానున్నది. ఈ చిత్రం ఏ ఓటీటీలో? ఎప్పుడు రానున్నదంటే?
గత కొద్దికాలంగా పవిత్ర లోకేష్, వీకే నరేష్ సహజీవన అంశం కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వీకే నరేష్ రెండో పెళ్లి వివాదాస్పదం కావడంతో వీరిద్దరి రిలేషన్ షిప్, డేటింగ్ వ్యవహారం మీడియాలో ఆసక్తికరంగా మారింది. అలాంటి జోడితో లవ్, రొమాంటిక్ సినిమా అనే సరికి అందరిలోను ఓ ఉత్సాహం కనిపించింది.

లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో మళ్లీ పెళ్లి చిత్రం మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు భారీ ప్రచారం అందుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌లో మెప్పించలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ఇక చివరకు ఓటీటీలో తన సత్తాను చూపేందుకు సిద్దమైంది.
మళ్లీ పెళ్లి చిత్రం ఆహా ఓటీటీతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్దమైంది. తెలుగు, కన్నడ వెర్షన్లలో ఈ చిత్రం జూన్ 23వ తేదీన రిలీజ్ కానున్నది. కన్నడలో మాతే మాధువే టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది. అయితే ఈ సినిమా ఓటీటీలోనైనా ఆకట్టుకొంటుందా? అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.
మళ్లీ పెళ్లి చిత్రంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించారు. స్క్రీన్ల్ ప్లే,దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ రాజు అందించారు. ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని సాధించలేదు.


Click it and Unblock the Notifications











