Unstoppable With NBK2: మూడు పెళ్లిళ్ల గోలపై బాలయ్య ప్రశ్న.. సరైన సమాధానం ఇచ్చిన పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ మొదటిసారి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఊహలకందని స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ లో అసలైన ఎపిసోడ్ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య అందులో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే విషయాలపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఊహలకందని స్థాయిలో..

ఊహలకందని స్థాయిలో..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షో పేరుకు తగ్గట్టుగానే కొనసాగుతోంది. ఇప్పటికే గోపీచంద్ ప్రభాస్ ఎపిసోడ్ పై ఊహలకందని స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఆ ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తి చేయడం జరిగింది.

క్లారిటీ రావడంతో..

క్లారిటీ రావడంతో..

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చాట్ షోలో పాల్గొనగానే అందుకు సంబంధించిన చాలా రకాల ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు వీరి కలయికలు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరగబోతుంది అని చెప్పగానే ఎవరు ముందుగా నమ్మలేదు. కానీ అధికారికంగా క్లారిటీ రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

మూడు పెళ్లిళ్లపై ప్రశ్న

మూడు పెళ్లిళ్లపై ప్రశ్న

ఇక ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎలాంటి సమాధానాలు అడుగుతారు అనే విషయంలో కూడా అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. తప్పకుండా బాలకృష్ణ కాంట్రవర్సీ విషయాలపై ప్రశ్నలు అడుగుతారు అని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన గురించి కూడా ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లుగా ముందే ఒక క్లారిటీ వచ్చింది.

సరైన సమాధానం

సరైన సమాధానం

ఇక ఈ పెళ్లిళ్ల గోల ఏంటి అని నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను సూటిగా ఒక ప్రశ్న అడగగా పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టుగా సమాధానం ఇచ్చినట్లుగా ఆ ఎపిసోడ్లో ప్రేక్షకులుగా పాల్గొన్నవారు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఎలాంటి సమాధానం ఇచ్చి ఉంటారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు కానీ అది సరైన సమాధానం అని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసినట్లుగా కలుస్తుంది.

 ఊర కుక్కతో సమానమని..

ఊర కుక్కతో సమానమని..

ఇక అలాగే నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రతిసారి నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కూడా సరైన సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇకనుంచి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఎవరైనా కామెంట్ చేస్తే వారు ఊర కుక్కతో సమానమని.. సమస్యలపై దమ్ముంటే ప్రశ్నించాలి అని, సమాధానం చెప్పకుండా ఆ తరహాలో ప్రశ్నించడం కరెక్ట్ కాదు అని ఆయన తీవ్రస్థాయిలో ప్రత్యర్థులకు హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఫుల్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా సమాధానం చెప్పి ఉంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X